ఈ పుట ఆమోదించబడ్డది

కృతజ్ఞతలు


ఈ గ్రంథ రచనలో ప్రోత్సాహ, సహాయాలందించిన అనేక మందికి నా కృతజ్ఞతలు. ముఖ్యంగా నా గురువర్యులు, శ్రేయోభిలాషులైన శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయం చరిత్ర శాఖలోని ప్రొపెసర్ వి. కామేశ్వర రావు గారికి, ప్రొపెసర్ సి. రఘునాధ రావు గారికి (చరిత్ర శాఖాధిపతి), ప్రొపెసర్ ఎస్. గోపాలకృష్ణన్ గారికి నా హృదయ పూర్వక కృత్ఞతలు.

ఎల్లప్పుడూ నా అభి వృద్ధి, శ్రేయస్సులను ఆకాక్షించేటటు వంటి మా కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ డాక్టర్ యం. పట్టాభి రామ రెడ్డి, డాక్టర్ వై. గోపాల రెడ్డి (ప్రభుత్వ కళాశాల, ఉలవపాడు, ప్రకాశం జిల్లా) గార్లకు, శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయంలోని జియాగ్రఫీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్. బాల కృష్ణా రెడ్డి గారికి, నేటి నా స్థితికి కారకులలో ఒకరైన గూడూరు ప్రభుత్వ కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీ కె. వెంకట సుబ్బారెడ్డికి, మాకళాశాలలో అధ్యాపకులకు స్వేచ్చను, పరిశోధనా వాతావరణాన్ని కల్పించి, మంచి విద్యను విద్యార్థులకు అందించాలని నిరంతరము తపిస్తున్న నా శ్రేయోభిలాషి, మాకళాశాల రెక్టార్ మరియు కరస్పాండెంటైన శ్రీ దొడ్ల రామ చంద్రా రెడ్డి గారికి, ఈ గ్రంధానికి ముందు మాట వ్రాసిన, గ్రంథంలోని భైరవ కోన ఫోటోలను పంపి సహాయము చేసిన మద్రాసు లోని భారత దేశ పురావస్తు శాఖ దేవాలయాల విభాగపు దక్షిణ కేంద్ర అధిపతి డాక్టర్ కె. కృష్ణ మూర్తికి, ఆంధ్ర ప్రదేశ్ పురావస్తుశాఖ అధిపతి డాక్టర్ వి.వి. కృష్ణ శాస్త్రికి, గ్రంథ ముద్రణకు అనేక విధాల సహాయ పడిన టి.టి.డి. ఓరియంటల్ కాలేజి లైబ్రేరియన్ శ్రీ ఎన్. తులసి రామి రెడ్డికి, ఈ గ్రంథ ముద్రణకు ఆర్థిక సహాయం చేసిన తిరుమల- తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, వారి ఎడిటర్ శ్రీ కె. సుబ్బారావు, ఇతర ఎడిటోరియల్ ఆఫీసు సిబ్బందికి, భారత పురావస్తు శాఖ ఎ.పి. వురావస్తు శాఖకు నా కృతజ్ఞతలు.

అతి తక్కువ కాలంలో ఈ గ్రంథాన్ని సుందరంగా తయారు చేసిన కావలి కోణార్క ప్రింటర్స్ ప్రొప్రయిటర్ శ్రీ జి. వసంత కుమార్ వారి ఉద్యోగ బృందానికి నా కృతజ్ఞతలు.

చరిత్ర శాఖ
జవహర్ భారతి
కావలి. 524 202,
నెల్లూరు జిల్లా. ఎ.పి.

దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి.