ప్రాంతపు రేనాటి చోడులు ప్రాంతీయ రాజవంశంగా నెల్లూరు ప్రాంతాలనుకూడ కొంతకాలము పాలించారు. సింహ పాద స్తంభములు,బ్రహ్మ,విష్ణు,ద్వారపాలకుల అర్ధశిల్పములు,శిల్పములందు గల schematic emphasis, అభియముద్రరూపణ,శంఖ చక్రముల రూపణ,ఎత్తైన కిరీటము,కొమ్ములుగల ద్వారపాలకులు, వారి దృష్టివంటివి పల్లవరీతిని (mannerism) తెలుపుచున్నవి. నాసిక లేక కూడుల పైభాగాన గల కీర్తిముఖతలలు (సింహతలలు) 'చిత్రఖండ' స్తంభాలు, 'భేకిభైవ' శిల్పరూపము,ఏకశిలా నందివంటివి పశ్చిమ చాళుక్యుల వాస్తుశిల్పరీతి ప్రభావాన్ని తెలుపుచున్నవి. భైరవకోన గుహాలయములు రేనాటి చోడులవై(కడప). యుండవచ్చుననికూడ ఒక అభిప్రాయాన్ని కె.ఆర్.శ్రీనివాసన్ గారు తెలిపారు. డా॥రాజేంద్రప్రసాద్ గారు ఇచటి మొదటి రెండు గుహాలయాలు 'నిర్మాణ రీతినిబట్టి క్రీ.శ 8వ శతాబ్దము మొదటి అర్ధభాగ కాలానికి చెందినవనియు,మిగిలినవన్ని క్రీ.శ 750-850 మధ్య కాలానికి చెందినవనియు అభిప్రాయపడినారు.
Dr. B. Rajendra Prasad says:
"The date of this Rock-cut Temples can be fixed with the help of Inscriptions. The Inscriptional label recording 'Brahmiswara Vishnu' found between temples 1 and 2 in Pallava grantha characters is ascribed to 8th century. Another inscription on the Southern end near temple 8, records that Lokama, the daughter of a Prince Rajaporeri and grand daughter of Govindaporari caused the erection of the shrine. This is dated to 9th century A.D. The stylistic analysis of the temples suggest that the cave temples No. 1 and 2, belong to the first half of 8th century A.D., while the rest of the shrine have been excavated during 700 to 850 A.D."
కాని ప్రొ॥ఆర్. సుబ్రమణ్యంగారు ఇచ్చటి గుహాలయాలు పల్లవరాజైన మొదటి మహేంద్రవర్మ కాలమున క్రీ.శ. 7వ శతాబ్దమున ఆ రాజుచే నిర్మింపబడినవని. కాని రెండు దశలలో నిర్మింపబడినవని, కావున భైరవకోన గుహాలయాలు క్రీ.శ. 7వ శతాబ్దము మొదటి అర్ధభాగము నుండి క్రీ.శ. 8వ ఉత్తరార్ధమునకు మునుపే రూపొందించబడినవని అభిప్రాయపడిరి. ఇదే అభిప్రాయమును మరుపూరు కొదండరామరెడ్డిగారు వెలిబుచ్చిరి. భైరవకోన గుహాలయాల నిర్మాణము ఉపసీక భోధిశ్రీ (238) అను బౌద్ధ భిక్షువుని కాలములో జరిగినదని శ్రీ సిరిపురం చంద్ర హాస్ గారు తెలిపిరి ఆర్.సుబ్బారెడ్డిగారు ఇవి తూర్పు చాళుక్య రాజైన కుబ్జ విష్ణువర్ధనుని కాలమునకు చెందినవై యుండవచ్చునని తెలియజేసిరి. దీనికి కారణం నెల్లూరు తూర్పు చాళుక్యుల పాలనలో యుండగా పల్లవరాజైన మహేంద్రవర్మ అతని తరువాతి రాజులు చాళుక్యులతో పోరాడి నెల్లూరును ఆక్రమించి కొంతకాలము మాత్రమే పరిపాలించిరని, కావున ఈ గుహాలయాలు తూర్పు చాళుక్యుల కాలానివేయని భావించినారు. కాని మహేంద్రవర్మ ఆంధ్రలో ఆనాటికే నిర్మించబడియున్న గుహాలయములను చూసి తన రాజ్యమున మహాబలిపురము, మొదలగు ప్రాంతములందు గుహాలయములు నిర్మించెనని వీరి అభిప్రాయము.
భైరవకోన గుహాలలో "త్రిభువనాదిత్యం" అంటూ చాళుక్యరాజుల పేర్లు మాత్రమే కాక, చాళుక్యశిల్ప గుణాలు చాలా కనపడుతున్నాయి. ఇక్కడి గర్భాలయాలలోని లింగములమీద బ్రహ్మసూత్రాలు భేదముతో కనపడుచున్నవి,అన్నీ ఒకేలాగు లేవు. రెండు నిలుపు గీతల నడిమి గీత ఇక్కడివింత. పల్లవులెరిగిన ధారా (డోరియాల) లింగము ఇక్కడ లేనేలేదు. శివలింగమునకు 'భస్కత్రి పుండ్రములు నడ్డముగా నుండక. మధ్య నొక చుక్కయు నడుమ మూడు నిలువు గీతలు,వాటి కిరువైపులా నర్ధచంద్రాకారముగా రెండు గీతలుండుట మరెచ్చటను కానపడవు'.