భైరవకోన గుహాలయాలు పైకి పల్లవరీతి కలిగి యున్నట్లగుపడును. కాని కార్నిస్ భాగములోని నాసికలు శిఖ, (crest) భాగమున వ్యాళను కలిగియున్నవి. ద్వారపాలురు langorous మరియు గుండ్రటి(rotund) రూపముల (figures)ను కలిగి కీలు(joint) భాగాలలో బిరుసు(stiffness) ను అననుకూల(disproportionate) అవయవములను కలిగి యున్నవి. స్తంభాలుకూడ పల్లవ, చాళుక్య(early 7th century A D.) రీతి మిశ్రమాన్ని కలిగియున్నవి. ముఖ్యముగా కాండము, 'కలశ', 'కుంభ' భాగాలలో ఇది అగుపడును. కుంభ భాగమున అష్టకోణాకృతి గల (kattu) సంగమ ప్రాంతమున చతురస్రాకార కాండము పై భాగమైన 'సందురం' పై విభాగమున గల 'పద్మబంధ' పుష్పముల ఉంగరాకార(loops) వివరాలలో ఇది అగుపడును. ఇవన్నియు చాళుక్య వాస్తు రీతి ప్రభావమును తెలుపు చున్నవి. గుహాలయ ముఖ భాగములు కూడ అటు పల్లవ రీతిని గాని ఇటు చాళుక్య రీతిని గాని పూర్తిగా చూపుట లేదు.
అంతే గాక తమిళ ప్రాంతాలలో గుహాలయాల నిర్మాణాలకు మహేంద్ర వర్మ కఠినశిల ఉపయోగించగా, మొగల్ రాజపురము, ఉండ వల్లి గుహాలయాలు మెతువు రాయి (sand stone)లో రూపొంచబడగా భైరవ కోన గుహాలయాలు schistose లో రూపొందింపబడి యున్నవి.
కాబట్టి మొగల్ రాజపురము, ఉండవల్లి, భైరవ కోన గుహాలయాలు పల్లవ ప్రభావాన్ని కలిగియున్నప్పటికి పల్లవేతర నిర్మాణలుగా భావించుటకు కూడ అవకాశ మిచ్చు చున్నవి. ఈ గుహాలయాల ప్రభావము తరువాతి నిర్మాణాలపై మన కగుపడదు. కాని తమిళ ప్రాంత గుహాలయాలు తరువాత నిర్మాణాలపై తమ ప్రభావాన్ని చూపినవి.
ఇవి క్రీ.శ. 7 వ శతాబ్దము రెండవ అర్థ భాగము నుండి క్రీ.శ. 8 వ శతాబ్దంతపు పూర్వ కాలమున నిర్మించబడినవిగా చెప్పబడు చున్నవి. ఈ కాలముననే ఆంధ్రలోని అలంపూర్ దేవాలయాలు చాళుక్య, రాష్ట్రకూట ఒరిస్సా దేవాలయాల ప్రభావముతో నిర్మించబడినవి.
ఆంధ్ర గుహాలయాలు
విజయవాడ అక్కన్న మాదన్న గుహాలయము:
విజయ వాడ వద్ద గల ఇంద్రకీల పర్వతపు తూర్పు, పశ్చిమ వాలు భాగాలలో గల గుహాలయములలో తూర్పు భాగాన గల అక్కన్న మాదన్న మండప మనెడి రెండవ గుహాలయము ముఖ్యమైనది. ఇది పెద్దది, అందమైనది. ఇందు ముందు భాగాన ఒక స్థంభ వరండా కలిగి దాని వెనుక భాగమున మూడు దేవ గృహాలను కలిగి యున్నది. శిల్ప రూపాలు మొదలగున నేమియు లేకుండా యున్నది. స్తంభాలు అష్ట కోణాకార విభాగమును కలిగి యున్నవి. ఈ స్తంభాలు పల్లవేతర వాస్తు రీతిని తెలుపు చున్నవి. కాని గ్రౌండ్ ప్లాను పల్లవ రీతితో యున్నది. ఈ గుహ ప్రాంతీయ పోషణతో ఏర్పరచబడినది భావించుట కూడ గలదు. ఇచటి క్లుప్త శాసనంలోని 'ఉత్పతి పిడుగు అనెడి బిరుదును బట్టి ఇది క్రీ.శ. 7 వశతాబ్దమునకు చెందినదిగా తెలుసుకొనుటకు ఉపయోగ పడుచున్నచి.
మొగల్ రాజ పురం గుహాలయాలు:
మొగల్ రాజ పురం గుహాలయాలు విజయవాడకు తూర్పున మూడు మైళ్ల దూరములో ఉత్తర దక్షిణములుగ యున్న కొండలలో గలవు. మొగలరాజ పురము గ్రామమునకు అగ్నేయమున గల పర్వతమున ఒకటవ గుహాలయము