ఈ పుట ఆమోదించబడ్డది

ప్రక్క నిర్మాణాల రీతులు మినహా) మనకు తోచును. ఉండవల్లి గుహాలు పల్లవేతర నిర్మాణాలుగా, బహుశా చాళుక్య నిర్మాణాలుగా తోచును. భైరవ కోన గుహలు పరిణతి చెందిన గుహాముఖ భాగముతో పల్లవ మామళ్ళ రీతికి దగ్గరగా అగుపడును. కానీ ఇచట గుహాలయాల ముందు ఏక శిలా నంది రూపణ పల్లవేతర రీతిని సూచించును. కాని ఇచటి పల్లవ గ్రంథ లిపిలోని క్లుప్తశాసనములును, త్రిమూర్తులలోని శివునికి దేవగృహంలో శివలింగరూప స్థానము, గుహ వెలుపలి ఇరువైపుల విష్ణు బ్రహ్మలకు స్థానములు కల్పించుటను పరిశీలించినచో పల్లవ రీతిని స్పస్టముగా తెలుపు చున్నవి. అంతేగాక విజయవాడ వద్ద గల అక్కన్న మాదన్నల గుహాలయంలోను, ఉండవల్లి లోని ఒక గుహాలయంలోను భైరవకోన గుహాలయంలోను, మహారాష్ట్ర లోని ఔరంగాబాదు జిల్లాలోని ప్రాచీన భోగవర్థన ప్రాంతమైన నేటి భోకార్థన్ లోని గుహాలయాలలోని ప్రాచీన తెలుగు, కన్నడ లిపిగా చెప్పబడు చున్న క్రీ.శ 7 వ శతాబ్ద కాల లిపిలో గల ఉత్పతిపిడుగు గా పలుక బడుచున్న ఒక బిరుదు బట్టి ఈ గుహలు గల ప్రాంతాలన్నింటినీ ఒకే రాజు ఆక్రమించి అతనిచే ఈ గుహాలయ వాస్తు రీతి ప్రవేశపెట్ట బడినట్లు భావించుట గలదు. ఈ కాలమున ఈ ప్రాంతాలాక్రమించిన ఘనత సాధించిన వాడు పల్లవరాజు ఒకటవ మహేంద్ర వర్మయని చెప్ప వచ్చును. పల్లవరాజ్యము మొదలుకొని చాళుక్యుల రాజధా ని బాదామి(వాతాపి) వరకు క్రీ.శ. 7 వ శతాబ్దమున ఆక్రమణ చేసిన వాడు ఇతడే.

కాబట్టి వాస్తు రీతుల ఆధారముగనే పై గుహాలయాల నిర్మాతల గూర్చి నిర్ణయించ వలయును. ఒక నిర్మాణము యొక్క కాలాన్ని ఆ నిర్మాణము లోని స్తంభములు, కార్బెల్స్, కార్నిస్, శిల్ప రూపణ, గ్రౌండ్ ప్లాన్, గుహాలయాల అంకితము కాబడిన దేవతలు మొదలగు వాటి ఆధారముగా నిర్ణయించవలెనని లాంగ్ హర్ట్స్ వంటి పురావస్తు శాస్త్రజ్ఞులు భావించినారు. పైరీతిలో పరిశీలించినచో తమిళ ప్రాంతాలలో వలె అంతస్తులేని గుహాలయాల వలే నిర్మింప బడినమొగల్ రాజపురము, భైరవ కోన గుహాలయాలు పల్లవ నిర్మాణాలుగాను, అంతస్తులు గల గుహాలయాలాతో కూడిన ఉండవల్లి గుహలు, దక్కన్ ప్రభావములో గల చాళుక్య నిర్మాణాలుగాను భావించ వచ్చును. కాని భైరవ కోనలో గుహాలయాలు పాక్షికముగా అంతస్తులతో నిర్మించుట జరిగి నట్లు అగుపడును. ఒక్కొక్క స్థాయి లోని ఈ గుహలు వేటికవి ప్రత్యేకముగా ఇచట అగుపడును. స్తంభాలు, కేపిటల్. కార్నిస్, ఆర్కిట్రేవ్ మలి(later) పల్లవ (మామల్ల) రీతిలో అగుపడును. కాని వీటి స్థంభ కాండమునకు (pillar shaft) కి (fluted character) లేదు. కాండము పైన 'తడి ', 'ఫలక ' లేదు కాని చాళుక్య రీతిలో వలే 'కలశ', 'కుంభ ' యుండుటయే గాక ఇవి ఒక nuxes loca' genesis మరియు మామల్ల తరువాతి రీతికి దగ్గరగా యున్నవి.

భైరవకోన రెండవ, ఐదవ గుహాలయాలపై గల క్లుప్త శాసనాలు కూడ ఈ గుహలు పల్లవులచే నిర్మించ బడినవిగా భావించుటకు అవకాశ మిచ్చుచున్నప్పటికీ ఇవి వేంగీ చాళుక్యులు లేక తెలుగు చోడులచే నిర్మించబడి యుండవచ్చునని భావించుటకు అవకాశము గలదు.

మొగల్ రాజ పురములోని ఐదవ గుహలోని పూర్ణఘట రూపణ పల్లవేతర రీతిని తెలుపు చున్నది. ఇది శాతవాహన, ఇక్ష్వాకుల కాలమునాటి బౌద్ధ నిర్మాణాలలో యున్నటు వంటి పూర్ణఘట వలెను, క్రీ.శ. 6 వ శతాబ్దము రెండవ అర్థ భాగమునకు చెందిన తొలి (పశ్చిమ) చాళుక్యుల ఐహోలెలోని దేవాలయములోను, తరువాత ఒక శతాబ్దానికి నిర్మించ బడిన ఔరంగాబాద్ గుహాలయముల లోను అగుపడెడి పూర్ణ ఘట రూపణ వలె యున్నది. ఇచటి ద్వార పాలురు కూడ తమిళ ప్రాంతములోని పల్లవ ద్వార పాలుర కన్న తక్కువ రమ్యత (suave ) కలిగి యున్నారు. అంతే గాక వారి very stance is different . ఇచటి నాల్గవ గుహాలయ ముఖభాగముపైన, పైకప్పు భాగాన తాండవ శివుని శిల్పరూపణ చేయ బడియున్నది. ఇది క్రీ.శ. 7 వ శతాబ్ద ప్రారంభమున చాళుక్య దేవాలయాలలో సుకనాస భాగమున నిర్మింప బడెడి తాండవ శివుని రీతిని స్ఫురింపజేసి ఈ గుహ చాళుక్య నిర్మాణముగా తెలుపు చున్నది.