వీరిలో బసవన్న ప్రముఖుఁడు. కృతిరచనాకాలమునకు వలయుఁ జరిత్రాంశము లీతని ప్రశంసాపద్యములనుండియే గ్రహింపవలసియున్నది. బసవన్న భార్య అమ్మలాంబ పాకనాటిలోని అల్లూరి అనమారారెడ్డి మనుమరాలు. పెమ్మమహీపతి కుమార్తె. బసవన్నను గూర్చి సూరనార్యుఁ డిటులఁ బ్రశంసించినాఁడు.—
క. | “వారలలోపల బసవ, క్ష్మారమణుఁడు పేరు పెంపు గలమన్నీఁడై | (ఆ.1 ప.37) |
సీ. | "కటకాధిపతి యైనగజపతిరాజుచేఁ బ్రతిలేనిపల్లకి పదవు లందె | |
తే. | చాటుధాటీనిరాఘాటఘోటకావ, లీఖురోద్ధూనిబిడధూళీవిలిప్త | 41 |
కృతికర్త తండ్రియగు బసవనృపాలుఁడు గజపతులకాలమునందుండి యాందోళికాదిగౌరవములు బడసెను. కర్ణాటనృపులచే రాజ్యములను బడసెను. గజపతులయనంతరము ఉదయగిరిదుర్గాధిపత్యముగూడ వహించెను. కాన బసవభూపాలునికాలము తెలిసికొన యత్నించుదము, కృష్ణదేవరాయలకాలమున కొండవీడు,