పుట:Andhra-Sri-Vishnu-Puranamu.pdf/275

ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విపులతర మైనవహ్ని హవిస్సువలన, హానిఁ బొందక వర్ధిల్లు నట్ల తలఁప.[1]

178


క.

జీర్ణించు వెండ్రుకలు గడు, జీర్ణించును లోచనములు చెవులును ముక్కు
జీర్ణించుగాని యాశలు, జీర్ణింపవు ముదిమి నరునిఁ జెందినవేళన్.

179


క.

అవివేకులు దృష్ణలచేఁ, దగిలి ప్రవర్తింతు రధికతరదుఃఖములన్
సువివేకులు దృష్ణలచేఁ, దవులక వర్తింతు రధికతరసౌఖ్యములన్.[2]

180


ఉ.

ఏను సహస్రవర్షములు నీగతి నీవిషయోపభోగసౌ
ఖ్యానుభవస్థితిం బ్రమద మారఁగ నుండితి నెట్టులుండినన్
మానదు తృష్ణ యింక ననుమానము మాని సుఖైకభోగముల్
మానినఁగాని కోరికలు మానవు కాకని నిశ్చితాత్ముఁడై.[3]

181


క.

పూరునకు యౌవనముఁ గడు, గారవమున నిచ్చి వార్ధకముఁ బూని ధరి
త్రీరమణుఁ డతని నవనీ, భారధురంధరునిఁ గాఁగఁ బట్టము గట్టెన్.

182


వ.

కట్టి యయాతి వనంబునకుఁ దపంబు సేయం జనియెఁ బూరుండు పూర్వాదిదిశా
చతుష్టయంబునకు యదుప్రముఖుల నలుగుర రాజులం జేసి సకలంబునకుఁ దాన
కర్తయై రాజ్యంబు సేయుచుండె నిట్లు పరమధర్మపరుం డైనయయాతిపుత్రకు
లందు జ్యేష్ఠుం డైనయదునివంశంబుఁ జెప్పెద.

183

యదువంశమహిమానువర్ణనము

క.

వెలయఁ జరాచరభూతం, బులకును ధర్మార్థకామమోక్షము లొసఁగం
గల నారాయణుఁడట యదు, కులసంభవుఁ డయ్యె మంచికుల మది గాదే.[4]

184


క.

పరమపవిత్రుం డగునా, హరి కృష్ణుఁ డనంగ మానవాకృతితో నీ
వరవంశంబునఁ బుట్టెను, నరు లీకథ వినినఁ గలుగు నానార్థంబుల్.

185


వ.

అని యనేకవిధంబులఁ గృపావర్ధిష్ణుం డైనశ్రీకృష్ణుని ప్రశంస చేసి పరాశరుండు
మైత్రేయున కిట్లనియె.[5]

186


ఆ.

విను సహస్రజిత్తుఁ డనఁగఁ గ్రోష్టుఁ డనన, లుండు నహుషుఁ డనఁగ లోకనుతులు
నలుగు రుదయమైరి నందనుల్ యదునకుఁ, బూరుషార్థచయము పుట్టినట్లు.

187


వ.

అందు సహస్రజిత్తునకు శతజిత్తుండును వానికి హేహయతాలజంఘవేణుహ
యులను బుత్రత్రయంబు పుట్టె నందు హేహయునకు ధర్ముండును ధర్మునకుఁ
గుంతలుండునుం బుట్టి రట్టికుంతలునిపేరఁ గుంతలదేశం బయ్యె నట్టికుంతలునకు

  1. పొలిసిపోవు = నశింపవు, విపులతరము = మిక్కిలి యధికము.
  2. తృష్ణలచేన్ = ఆశలచే, తగిలి = ఆసక్తులై.
  3. ప్రమద మారఁగ = సంతోష మతిశయించంగా, అనుమానము = ఊహ - అది గావలె ఇది గావలె నని యూహించుట యనుట.
  4. నారాయణుఁడఁట యదుకులసంభవుఁ డయ్యె = నారాయణుండు యదుకులసంభవుఁ డయ్యెనఁట యని యన్వయము.
  5. వర్ణిష్టుండు = వర్ధిల్లుస్వభావము గలవాఁడు.