ఈ పుటను అచ్చుదిద్దలేదు
52

ఆంధ్రనాటకములు.

స్త్రీలననుకరించెడి స్త్రీపాత్రములు రంగస్థలమునందు జేతులుద్రిప్పికొనుచు గంతులువైచుచు బురుషులతో సరససల్లాపములాడుట జూచిన నా స్త్రీలు కులీనులా కులటలాయను సందేహము ప్రతివారిమనమునందు బుట్తుచుండును, ఇట్టి శృంగారరసప్రదర్శనము దానరులాడెడి తోలుబొమ్మలాటవలె గాన్పించునుగాని సరసమగు నాటకప్రదర్శనముగనుండదు.

        పామర జనాకర్షణమునకో లేక జీవితచరిత్రము లయొక్క ప్రతిబింబిత సాధనమ నకోయన నిప్పుడిప్పుడు మరణము హత్యమొదలగు ఘోరప్రదర్శనములను రంగస్థలముల గనుపఱచుట జరుగుచున్నది. ఇట్టి భయావహములగు విషయము లను జూపగూడదని ప్రాచీననాటకనిర్ణేతలుఖండనము గా జెప్పియుండుటయు, మహానాటకకర్తలా నిబంధనముల నితిక్రమింపకపొవుటయు బహుశ గ్రంధవేత్తలెఱింగిన విషయమే. ఈ కాలమునందు బ్రాచీనాచారములను, బ్రాచీన నియమములను బూర్వపక్షముజేయుటయు, సంస్కరణయోగ్యమగు వానిని సంస్కరించుటయో, లేక నతిక్రమించుటయో విధాయకముగ నున్నను గొన్నివిషయములు మాత్రము మానవజీవిత పారిశుద్ధ్యముకొఱకు సర్వదాయనతిక్రమణీయములు. అట్టివిషయము లలో నిదియొకటి. ఘోరప్రదర్శనములు కేవలము భయానహములయి జుగుప్సాకరములయి నాటక దర్శనాకౌతూహలమును జాలవఱకు దగ్గించును. మానవహృదయములయందు సహజకారుణ్యభావముల శుష్కింపజేసి కాని