ఈ పుటను అచ్చుదిద్దలేదు
46

ఆంధ్రనాటకములు.

మును వర్ణింపుచు పెద్దన యాంధ్రబ్రాహ్మణనతంను ని వేషమును వర్ణీంచెను.

సీ. అర్ధచంద్రుని తేట నవఘళించు లలాట
               పట్టిదీర్చిన గంగమట్టీతోడ
   జెక్కుటద్దములందు జిగివెల్లువలుచిందు
             రమణీయ మణికుండలములతోడ
   బసిడివ్రాతచెఱంగు మిసిమిదోపజలంగు
            వరుణాంశుకోత్తరీయంబుతొడ
  సరిలేసిరాకట్టు జాళువా మొలకట్టు
           బెడగారు నీర్కావిపింజెతోడ
సీ. ధవలేధవళములగు జిన్నిదములతోడ
    గాళికాముద్రయిడిన యుంగరముతోడ
    శాంతరసమొల్కు బ్రహ్మతేజంబుతోడ
    బ్రఫరుడయ్యె వియచ్చరప్రవరుడపుడు.

[మను చరిత్రము]


    రాజవేషమునుగురించి యిట్లుజెప్పబడినది;
    శ్రీకృష్ణుని వర్ణీంచుచు ముక్కుతిమ్మన్న యిట్లు
జెప్పెను.
     "వెన్నెలనిగ్గులు వెదచల్లెడుమడుంగు
     లందిచ్చెనొక్క పూర్ణేందువదన"

[పారిజాతాపహరణము.]