ఈ పుటను అచ్చుదిద్దలేదు

23

పాత్రపోషణము.

భవజ్ఞానము లేని బాలుడుకాని పరిశీలనదృష్టి లేని వృద్ధుడు కాని రచించినగ్రంధములయందు బాత్రౌచిత్య మంతయుండుట కవకాశము తక్కువ. ప్రకృతినిర్ధిష్టములగు పాత్రములయంధు ప్రకృతిలక్షణములు గాన్పించనియెడల బ్రకృతి నన్వేషించి సాధించుటవలన గలిగెడి యాహ్లాదము మనమనంబులయందు గలుగుట దుర్లభము. అట్టి యాహ్లాదము గలుగనిచో నానారకముల నీరసము లనియు, అస్వాభావికములనియు నిరసించుదుము. ఈవిషయముననే షేక్స్పియరు మాహాకవియిట్లు చెప్పి యున్నాడు. "The purpose of a play is to hold, as it were, the mirror up to Nature; to show virtue he own feature, scorn her own image and the very age and body of the time his form and pressure."

   కావున ప్రకృతిప్రపంచమునుండి తీసి కనుపఱచిన పాత్రములు ప్రకృతిసిద్ధములుగ నుండ వలెను. బహిరాకారములును మనోభావములును, సమానముగ నే ప్రకృతియందు  బ్రతిబింతములుగ నుండబోవు. సులక్షణకృతుల నాదర్శనిష్పత్తి కనుకూలముగ జేర్చి చిత్రించినచో నాటకగౌరవము చేకూరును. అవలక్షణవికారములును మాత్రమే స్వీకరించి హాస్యజనకములుగ నుండునట్లు ప్రదర్శించి నట్లయిన నానాటకములు తేలికయై ప్రహసనములుగా నుండును. కాని యుభయవిషయ ములయందును ప్రకృతియొక్క ప్రతిఫలము సమానముగనే యుండును. అయినను యుద్దేశభేద ముచే గుణప్రదర్శనభేదము గలుగుచున్నది.