ఈ పుటను అచ్చుదిద్దలేదు

19

నాటకనిర్మాణము.

ముగా జేయబడుచున్నది. ఆకారణముచే నాటక ప్రేక్షకులు బూమికిం జెందగ యాకాశమునకుం జెందక మధ్య నంతరాళమున ద్రిశంకునివలె నూగులాడుచుందురు. కవులన్నెనో విశృంఖలులై స్వేచ్చావిహారులయి యా యతిమానుషపాత్రముల యధేష్టముగా వర్ణింతురు. కొందఱుత్కృష్టముగాను కొందఱతికృష్టముగాను వర్ణించుచుందురు. కావున నియ మాన్వితులగు వాజ్మయ రసికనతంను లేవగించుకొని నిరుత్సాహులగుచున్నారు. ఇట్టి దురవస్థ యీ మానవప్రకృతియుతమగు ప్రత్యక్ష ప్రబంధమును బోరాడుటవలననే కలుగుచున్నది.

   మానవప్రకృతిని వర్ణించుట యెక్కువగుకష్టమని యెల్లరకుం దెలిసిన విషయమే. ఏలయన మానవ లక్షణములు వివిధజాతులలో వివిధదేశములలో వేఱ్వేఱు రూపములు దాల్చియుండుటచే నాయా లక్షణముల గ్రహించినగాని నిజముగా గ్రంధకర్త వానిని గుఱించి వ్రాయలేడు. ఇట్తి గ్రహణశక్తి యనుభవఫారీణులకే గాని యలవడదు. కావున నల్పవయస్కులు మొదలగువారు నాటకరచనకు గడంగినచో నడుగడుగునకు దడబడుచుందురు. అట్టి యనుభవహీనులు వ్రాసిన గ్రంధములు రసహీనము లై తేలికగానుండి ప్రజలకు రోతపుట్టించును. ఆహేతువున సాహిత్యాంతమగు నాటకము పసిబాలుర చేతులలో బడి చెడిపోవుటయు దటస్థించును. కావున నీముప్పు దప్పించి నాటకముల నెప్పుడు నున్నతపద