ఈ పుటను అచ్చుదిద్దలేదు

7

నాటకతత్వము.

      ఆంధ్రనాటకములయం దాంధ్రేతరపపాత్రము లెట్టి భాషను మాట్లాడవలె నని యిటీవల కొంతచర్చ జరుగు చున్నది. అనగా తురకలు మనరంగస్థలములందు మాట్లాడునపుడు యెటువంతిభాష మాట్లాడవలయునో యాంగ్లేయులు, మనరంగస్థలములయం దున్నప్పు డెట్టి భాష మాట్లాడవలెనో, మొదలగు సమస్యలు, నిర్వచనముచేయబడుచున్నవి. ఈసమస్యలను గుఱించివ్రాసినవారందఱేకగ్రీవముగా నొక్కసంగతి మాత్రమంగీకరించిరి. ఆదేదన;-ఆంధ్రనాటకములయం దేయేజాతి వారు వచ్చినను, ఆంధ్రభాషనె మాట్లాడవలయును గాని, యితరభాషలను మాట్లాడగూడ దని సిద్ధాంతము చేయబడినది. అనగా తురకలు కేవలము, తురక మే మాట్లాడగూద దనియు, ఆంగ్లేయులు, ఇంగ్లీషుభాషను మాత్రమే మాట్లాడగూడదనియు, వీరందరు దెలుగుభాషయం దేమాట్లాడవలయుననియు నందఱు సమ్మతించిన విషయమే. అయినను వీరందఱు మాట్లాడెడి తెలుగు భాష యెట్లుగా నుండవలెను? ఇందునుగుఱించి వేఱువేఱూభిప్రాయ్ములను వేఱువేఱు రసజ్నులు వక్కాణించిరి. ఏయేజాతివారు, మన తెనుగు నెట్టెడ్లు మాట్లాడుదురోయాయా విధమయిన పరిభాషలో మాట్లాడించుట స్వాబావికముగానుండునని కొందఱి మతము, అనగా తురకలు తెలుగు మాట్లాడు నప్పుడు వ్యాకరణము నందును, ఉచ్చారణ మందును ఏవిధమయిన వైచిత్ర్య్లములను గనుపిచెద రో, ఆవైచిత్ర్యముల