ఈ పుటను అచ్చుదిద్దలేదు

చూచువారునుగూడ ఈచిన్నపుస్తకమ్ను జదివి లాబము పొందగలరు. తెలుగునాటకజనులకు త్రోవజూపిన ఆంగ్లసంస్కృతి నాటకముల రీతు లిందు ప్రస్తావికముగ నుగ్గడింపబడినవి.

  మాసనచిత్తిప్రవృత్తులను శుద్ధపఱుచుటయే నాటక ముల ముఖ్యోద్దేశ్వమనియు, నాటకరచనకు పద్యశైలి ఎక్కువగ నొప్పుననియు, వైదేశిక పాత్రములకు ఆయా పదవ్లకు దగినటుల తెలుగునే ఉపయోగించివలయు ననియు, చరిత్రాత్మకమగు నాటకములు ఎక్కువ వెలువడవలసియున్నవనియు దు:ఖాంతనాటకములను నిషేధింపరాదనియు, షరాయి మున్నగు లపంగితాచ్చాదనములును సాంప్రదాయ విరుద్ధములగు యననికాచిత్రకాదులును ఆంధ్రగ్రందమునకు తగినని యవ పద్యములు రాగ యుక్తముగ వచింపబడవచ్చుననియును, హత్యాది ఘోరప్రదర్శనములు కూడవనియును శ్రీ అచ్యుతరామ పంతులుగారు ఈపుస్తకమును ఆయాప్రకరణములలో తెలియపరిచిరి. కేవల వచన రూపక నాటకములు వీరికి సమ్మతములుగావు. కాని ఇకముందు ఇట్టివియే విశేషముగ రానున్నవి. బెర్నార్డుషామున్నగు ఆంగ్లకవులు వచన నాటకములనే వ్రాయుచున్నారు. నాటకమునకు వచువారిలో నూటికి తొంబండ్రు భాషావిషయమున ప్రౌడులయి పుట్టిరి అట్టివారికి పద్యముల భావములు ఒకపట్టున స్ఫురింపు గద్యప్రసంగములు అప్రయత్నముగ గ్రాహ్యములగును. నాటకగ్రంధమును ప్రేక్షకులు ముందుగ చదువుకొని తత్ప్రదర్శనమును చూచుటకై నాటకశాలకు రావలయునని