ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బందుమంచు దశాఢకి పలుకఁబడును బొదలు నేకాదశాఢకి పదునొకల్తు
మనఁగఁ బన్నిద్దు నున ద్వాదశాఢకి తగుఁ బుట్టి యన భార మగు మాతృభూతలింగ.

271


సీ.

కాణి యనంగను గాకణి విలసిల్లు వెలయుఁ దద్వయ మరవీస మనఁగఁ
ముక్కాణి యనఁగను బొల్చుఁ దత్త్రయసంజ్ఞ పణషోడశాంశంబు పరఁగు వీస
మనఁగఁ దద్ద్వితయంబు దనరు బరక యన మువ్వీసమం చనఁ బొల్బుఁ దత్త్ర
యాఖ్యయై పణచతుర్థాంశంబు పాతిక యన విరాజిలును బణార్థసంజ్ఞ
యొప్పు నడ్డుగ యనఁగఁ బాదోనపణము వఱలు ముప్పాతిక యనంగఁ బణము రూక
యనఁగఁ జెన్నొందుఁ బణదశకాఖ్య చెల్లు మాడ యన నిట్లు చెప్పెద మాతృభూత.

272


సీ.

దీనారమందు ద్వాత్రింశదంశం బైన బేడయం చనఁగను వెలయుచుండు
దుగలమం చనఁగఁ దద్యుగళంబు విలసిల్లుఁ దనరు ముచ్చవ కనఁ దత్త్రికంబు
తచ్చతుష్టయసంజ్ఞ దగుఁ జ్గౌలమం చనఁ బాదదీనారంబు పా వనఁ దగు
నర్ధదీనారాఖ్య యలరు మాడ యన న్వరా యన దీనారమై యెసంగు
నాణె మనఁగను శుద్ధదీనార మొప్పు హీనదీనారసంపూర్తి కిచ్చునట్టి
ధనము పట్ట మనంగను దనరియుండుఁ భూతిలసితాంగ శ్రీమాతృభూతలింగ.

273


సీ.

ఎడబె ట్టనంగను నెరుసనా బారిముద్ర యన దీనారభేదములు చెలఁగు
కా సనఁగాను గాకణిపేరు విలసిల్లు బైకమం చనఁగఁ దద్ద్వయము వెలయు
దమ్మ మనంగను దార మనంగను దచ్చతుష్టయసంజ్ఞ దనరుచుండుఁ
దద్ద్వాదశం బైనఁ దగు నేబునాఁగను జను టంక మనఁగ నిష్కాహ్వయంబు
దద్విశేషాభిధలుగాను దగును డబ్బు లనఁగ దుగ్గాను లనఁగ దుడ్లనఁగ జగతి
శూలధారి పరాతంకచోళవైరిపుంగవతరంగ శ్రీమాతృభూతలింగ.

274


సీ.

 పంపు పాల్ వంతునా భాగంబు విలసిల్లు నాస్తినా సర్వస్వ మలరుచుంచు
సరకు సంకట మనఁ జనును బణ్యద్రవ్య మమరు రొక్క మనఁ బైక మన ధనము
గుళిక పూటె యనంగ ఘటికాహ్వయం బొప్పు రాపొడి నా ఘృష్టరజము చెలఁగుఁ
దగటనఁ దగడనఁ దనరు లోహదళమ్ము మనుఁ దప్తలోహాఖ్య మం డనంగఁ
గడ్డి యనఁగ శలాకనాఁగను శలాక యమరు గుండన నుండనా నమరు గోళ
కాఖ్య రస యనఁగాను లోహశకల మగు భూషితభుజంగ శ్రీమాతృభూతలింగ.

275


సీ.

పచ్చ యనంగను బరఁగు మరకతంబు గారుత్మతం బొప్పు గరుడపచ్చ
యనఁ దద్విశేషాఖ్య యగును బేరోదనం బన నది కృత్రిమం బయిన వెలయు
మాందాళియం చన మౌక్తికం బొప్పును ముత్తెము ముత్యము ముత్తియ మనఁ
దద్విశేషాభిధ దనరు దార మనంగ నాణియం చనఁగ సుపాణి యనఁగ