ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

తనరు గోణ్యుద్ధారిదండాఖ్య యెత్తనగో లన బట్టనగోల యనఁగఁ
గంథాస్తరణ మొప్పుఁ గందరికం బన నలరు విక్రయ మమ్ము డమ్మక మన
మారక మనఁగను మారుగడ యనంగ వినిమయనాభిధ వెలయుచుండు
విలువనా జట్టినా వెల యన రోయన వెలయుచు నుండును విక్రయంబు
కొనుట దర దారణ యనంగ మనును గ్రయము మొదలు బండాల మనఁదగు మూలధనము
మిగితి మిగు లన లాభంబు మీఱుచుండుఁ గుదువ యనఁగను నుపనిధి పొదలు శర్వ.

267


సీ.

ఒకటి యొక్కటి యొకం డొండొక్కఁ డనఁగను నేకసంఖ్యాఖ్యయై యెసఁగుచుండుఁ
బది యన దశసంఖ్య పవరఁగు నిర్వది యన వింశతిసంజ్ఞయై వెలయుచుండుఁ
బొలుచుఁ ద్రింశత్సంఖ్య ముప్పది యనఁగఁ జత్వారింశదాఖ్య నల్వది యనంగఁ
బంచాశదాఖ్య యేఁబది యన రాజిలు నఱువది యనఁగను నలరు షష్టి
దనరు డెబ్బది సప్తతి యన నశీతి యెనుబది యనంగ భాసిలు నెసఁగు నవతి
తొంబది యనంగ నూఱనం దోఁచు శతము వేయి యన సహస్రాఖ్యయై వెలయు నభవ.

268


సీ.

కరిసె యనంగను గాలుపలం బొప్పు నరపలం బనఁగఁ గర్షాఖ్య యొప్పుఁ
గర్షద్వయాభిధ గనుపట్టుఁ బల మన నిర్పల మనఁగను నెసఁగు ద్విపలి
ముప్పలమం చన నొప్పుచుండుఁ ద్రిపలి నలుపలం బనఁ జతుఃపలము దనరుఁ
బంచపలాభిఖ్య పరఁగు నేఁబల మన వెలయు షట్పలి యాఱుపల మనం గ
నుల్లసిలు సప్తపలినామ మెల్ల మనఁగ వఱలుఁ బన్నిర్ల మనఁగను ద్వాదశపలి
వీసె యనఁగను గనుపట్టు వింశతిపలి దడియ మన నల్వది పలముల్ దగును శర్వ.

269


సీ.

తనరారు సోల యంచనఁగ నికుంచాఖ్య యద్దయం చనఁగఁ దదర్థ మొప్పుఁ
దత్తురీయాంశంబు దగును జిట్టి యనంగఁ గుడుపాభిధానమై యడరు నవల
మాననా ముంతనా మానిక యనఁగను ద్రవ్వనాఁ బడినాఁ దదర్థ మెసఁగుఁ
బ్రస్థనామంబుగాఁ బరఁగుఁ గుంచ మనంగ గుడుపషట్కంబు ముయ్యెడ యనఁదగుఁ
బ్రస్థయుగ్మాఖ్య యిరుసనాఁ బలుకఁబడును జనును ముక్కుసనాగఁ బ్రస్థత్రయంబు
తూమునా నాఢకాభిధ దోఁచుచుండు భూరిభవభంగ శ్రీమాతృభూతలింగ.

270


సీ.

ప్రస్థపంచకసంజ్ఞ పరఁగు నేఁగుస యన షట్ప్రస్థపే రాఱు ననఁగ వెలయు
నిద్దుమం చనఁగను నేసఁగును ద్వ్యాఢకి త్ర్యాఢకి ముత్తుమం చనఁగఁ జెల్లు
జతురాఢకీసంజ్ఞ చనును నల్తు మనంగఁ బంచాఢకియు నేఁదు మంచుఁ దోఁచుఁ
షష్ఠాఢకీసంజ్ఞ చను నార్దుమం చన సప్తాఢకీసంజ్ఞ జరుగుచుండు
నేడ్డుమం చనఁగను నెలమితోఁ గనుపట్టు నష్టాఢకీసంజ్ఞ యలరుచుండు
నెనమందు మనఁగను దనరుఁ దొమ్మందుమనంగ నవాఢకీనామ మొప్పుఁ