ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

లవణభానితశలాటువు మీఱు నూరుఁగా యన మాంసరస మొప్పు నాణ మనఁగఁ
గఱకు ట్లనంగను గరుపట్టు శూల్యంబు తాలింపు తిరుగుఁబోఁత పొగు పనంగ
సంస్కారము చెలంగుఁ బనును దాలింపు వైచినది పొరఁటినది పొనటినదన
వఱలును సంస్కృతవాచకంబులు గాను వడకట్టు గాలింపు కడుగు డేరు
పఱుపనఁగ శోథనాభిధ పరఁగుచుండుఁ జిక్కన మిసిమి మిహి జిడ్డు జిగురు జిగట
నునుపు నున్నన నిద్దము నున్నని దన స్నిగ్ధనామంబు చెలఁగును జిత్స్వరూప.

252


సీ.

బోరు లనంగను బొరుగు లనంగను ధానాసమాఖ్య లై తనరుచుండుఁ
బొరుగులు మొదలుగాఁ బోచిళ్ళు వరకులు బహువచనాలుగాఁ బరఁగుచుండు
గుగ్గి ళ్ళనంగను గుల్మాషములు మీఱు లాజలు దనరుఁ బేలా లనంగ
నటుకు లడుకులు నా నగుఁ బృథుకంబులు ప్రాలునా నక్షతల్ వఱలుఁ బ్రార్థ
నాక్షతల పేరు పోచిళ్ళునాఁగ బియ్య మనఁగ జాత్యేకవచనమై యలరుఁ దండు
లము దనరు నార్ద్రతండుల మ్మమరు నానబాలునాఁగను బటదాశ పార్వతీశ.

253


సీ.

ఆక్షుణ్ణతండులాహ్వయము చేరుళ్ళునా దంగుళ్ళు నాఁగను దనరుచుండు
నాహతతండులాహ్వయము లెసటిపోత లన సడింపు లనంగ నలరుచుండుఁ
బక్వచర వ్రీహిభవతండులసమాఖ్య యుప్పి ళ్ళనంగను నొప్పుచుండుఁ
దండులధూళియౌఁ దవుడనఁ బిష్టంబు పిండినా సత్తునా వెలయుచుండుఁ
జనును జలివిడి చలిమిడి యన విఘృష్టి త మ్మపూపాభిధానమ్ము దనరుఁ గజ్జ
మప్ప మప్పచ్చి కజ్జాయ మనఁగ మండిగ లనఁ దగు మండికమ్ములు గరళకంఠ.

254


సీ.

సేవె లనంగను జేవికల్ విలసిల్లు నుత్కారిక వెలయు నుక్కెఱ యన
గారి యనంగను ఘారి దనర్చును నతిరసంబు చెలంగు నరిసె యనఁగఁ
బొల్చు మాషాపూపము వడ యనంగను వడియ మనంగను వటక మెసఁగు
గరిపడ యనఁగను ఖరవటకం బొప్పు బూరె యనంగను బూరిక తగు
బుబ్బుద మనంగఁ దనరును బుద్బుదంబు లడ్డువ యనంగ లట్వ చెలంగుచుండు
సారెసత్తు లనంగను జంతికలన యంత్రికలు మీఱుచుండు శేషాహిభూష.

255


సీ.

చక్కిల మనఁగను శష్కులి విలసిల్లు సుకుని యనంగను సుఖిని చెలఁగుఁ
బిష్టము చెలఁగును బిట్టనఁ దద్విశేషము మీఱుఁ దోఁపనా సంకటి యన
నప్పడ మనఁగను నడరు నపూపలి కుడు మన మోదకం బడరు మణుఁగుఁ
బూవునాఁగను నేర మూలము దనరును తిలగోళ మెసఁగుఁ జిమ్మిలి యనంగఁ
దోఁచు మధుపూరితము తేనెతొన యనంగ రొట్టె నీరొట్టు నిప్పటి యట్టు దోసె
యిడైన యనంగ నిటుకొన్ని యెసఁగుచుండు భక్ష్యభేదాహ్వయంబులు పార్వతీశ.

256