ఈ పుట ఆమోదించబడ్డది
4

ఆంధ్రభాషార్ణవము

తురంగంబే నేన యని యభినయించురీతిని గైజా మోరలు చేయునిరాఘాటధాటిసమా టీకఘోటీవటలంబు జటిలం బగుచునుండ వేల్పుల కిక్కయు నమృతంబు చుక్కయునిడుటకు నమందానందంబుఁ జెందు మేరుమందరంబులకు నమదభద్రగజంబుల నొసంగ నధివసించి యదవీయదానంబునం బొగడువడువున భూరిభేరుల గంభీరభాంకారంబులు చెలంగఁ గవిజన దారిద్ర్యంబులు నిరాకరించుచందంబున నిందువదనా కరారవిందసముత్సారితంబు లగుచామరంబులోలయ నిరంతరశ్రీమంతులగుసామంతులును రూపజితమారు లగు రాజకుమారులును గుణసింధువు లగుబంధువులును సలలిత తంత్రు లగుమంత్రులును సకలవిద్యాసరోజనీరవు లగుకవులును వాదైకధుర్యు లగు శాస్త్రివర్యులును నాదసుఖసంధాయకు లగు గాయకులును భరతకళారహస్యోత్కటు లగునటులును శృంగారకణిక లగుగణికలును గొలువ సభాంతరాళంబున గోలువుండి నన్ను రప్పించి సన్మానంబు సేయుచు వినయంబున. 7

క. ఖచరీకచకుచనిచల, ద్విచికిలహారస్రవన్న వీనమరంద
ప్రచురరుచిఁ బెనఁగొనుఁ గచా, కచిగా నీకవిత లెన్నఁ గని వెంకన్నా. 8

తే. ఆంధ్రగీర్వాణకవనంబులందు నీకుఁ, గలుగుజ్ఞానం బ దేరికిఁ గలుగ నేర్చు
నాశ్రితుఁడ నంచు నుతియించు నట్లు గాడు, గాని యవి యిపు డేల వెంకన కవీంద్ర. 9

తే. దేవతలభాష గావునఁ దెలుఁగుకన్న, సంస్కృతము మిన్న యాయుక్తి సరియె తెలిసి
రాసికుఁడగువాఁడు తనదు జాఱుసికలోనఁ, దులసినే యిడుకొనునొజాదులనె యిడునో. 10

తే. కాన యీయాంధ్రకృతులందుఁ గలుగునట్టి, పదములకు నెల్ల నర్దమేర్పడెడు రీతి
నద్భుతంబుగఁ గృతిని జేయంగవలయు, నర్ధమైన రసస్ఫూర్తి యగుట యరుదె. 11

తే. కృతికి నాయకు మాతృభూతేశు జేయ,వలయు నన నేను నట్టకాఁ దలఁచితి ననఁ
బసిఁడిసొమ్ములు సేయించి వంట రాళ్ళ, జెక్కినను మేలె రత్నముల్ చెక్కకున్న. 12

వ. అనిన నెనుం దదీయపరమేశ్వరచరణారవిందభక్తికి మెచ్చుచు సత్కులప్రసూతుండ వగునీకు నేతాదృశమనీషావిశేషం బరుదే యని తత్కులప్రశంస సేయం దలంచి. 13

సీ. రంభాదినైలింపకుంభస్తనీమనణుల్ బానిస లగుచును బనులు నేయఁ
గకుబంతముల నేలఁ గలవేల్పుగమి కాంచు సమయములేక మోసలను గాయఁ
గులధరాధరములు చలనంబులను మాని యెచటఁ దార్ని ల్చెనో యచట నుండ
గర్వథూర్వహు లైనశర్వరీచరవరుల్ నిలువఁ గూడక రసాతలము సొరగఁ
గల్పకమునీడ వినువాఁకగట్టుతలఁపుమానికపుఁ దిన్నెఁ గిన్నరీగానఫణితి
నాలకించుచు నానంద మనుభవించు నల్లదేవేంద్రుఁ డలవియె యతనిఁ బొగడ.