ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తిర్యగాబద్ధదండంబు తేజరిల్లుఁ, జిలుకకొయ్యన పడెనాఁగ జెలఁగుచుండు
నాగదంతక మెలిసెనా నలరు భిత్తి, కాచ్ఛదిస్పందిసంజ్ఞయై యచ్ఛదేహ.

20


సీ.

దోఁపుచూ రనఁగను దోఁచు నంతచ్ఛది కొణిగచూ రనఁగ నగు న్వలీక
మలరుఁ దోవ యనంగ వలభి టంకనఁగను దనరు విటంకంబు దారబంద
మన ద్వారబంధ మెప్పును దోరణ మనంగ నవు బహిర్ద్వారంబు గవని గవిని
గవఁకు గవను నాఁగ దివురు గోపురసంజ్ఞ లరఁ గరుఁ గన వేది యై తలిర్చు
దిన్నె దిబ్బ యనంగ హస్తి నఖ మొప్పుఁ దలు పనఁ గవాట మౌ బోరుతలుపు నాఁగ
గళయుగకవాటసంజ్ఞయై తనరు గంద పట్టెనా స్కంధపట్టిక వఱలు నభవ.

21


సీ.

రోలుమ్రా నుదుకనాఁ బోలుఁ గవాటమూ లాలవాలాభిధ యర్గళాఖ్య
గడియనాఁ దగును బీగము తాళ మనఁగ నయోమయార్గళవిశేషోక్తి యొప్పుఁ
దదవయవాఖ్యయై తనరు గొళ్లె మనంగఁ దాఁప మెట్టిక తంతె తాఁపరంబు
మెటిక మె ట్టనఁగను మెఱయు సౌపానంబు నిశ్రేణి శాఖ్యయౌ నిచ్చెన యనఁ
బొరక చీఁపురుకట్ట చీఁపు రనిపల్కఁ దగును సమ్మార్జనికిని జెత్తనఁ జెదార
మనిన నవకర మొప్పును నలు కనంగ నమరు నుపలేపకద్రవ్య మమరవంద్య.

22


సీ.

కలువడంబు కలాపి కలయంపి చానపి యన గోముఖాఖ్యలై యలరుచుండు
రంగవల్లాఖ్య యై రాజిల్లు మ్రుగ్గన మొగవాళ మనఁగను దగును నిస్స
రణము మెల్లన నికర్షణ మొప్పు లోగిలి యన వాస్తుసంజ్ఞయై తనరుచుండు
నూరు కుప్పము గ్రామ మొప్పు శూన్యగ్రామవాచకంబై యుండుఁ బా డనంగఁ
బల్లె యనఁ బల్లి యగును వ్రేపల్లె యనిన గొల్లపల్లె యనంగను ఘోష మగును
గూడె మని గోడె మని యనుకొందు రార్యు లెల్లఁ బక్కణమునకు బాలేందుమాళి.

23


క.

పొలిమే రన గడి యనఁగాఁ, బొలిమెర యన నెల్ల యనఁగఁ బోలును సీమా
స్థలనామధేయములు ని, శ్చలతరసుఖకృతి త్రిశీర్షశైలాధిపతీ.

24


తే.

అగడిత యగడ్త యనఁగ ఖేయంబు దనరు, మందుపట్టడపేరు చెన్నొందు బాణ
శాల యనఁగను దజ్జీవిజనము వెలయు, నిమితగాం డ్లనఁగా సుగంధికబరీశ.

25


తే.

శ్రీలు వెలయంగ నీ పేరఁ జేయుకతనఁ, బరఁగు శాశ్వతముగఁ బురవర్గ మిట్లు
గైకొనుము దీని భక్తసంఘాభిమాని, మాతృభూత జగత్త్రయీమాతృభూత.

26

ᛟᛟᛟᛟᛟᛟᛟᛟᛟ

శైలవర్గము

క.

మె ట్టనఁ గొం డన మల యన, గ ట్టన గుబ్బలి యనంగఁ గరువ యనంగా
గుట్ట యనఁ దిప్ప యనఁ గ, న్పట్టును శైలాఖ్య లార్యభావితచర్యా.

27