ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మైన నడకకు అనుకూలముగా ఉంటవి. ఇటువంటివి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలము, మత్తేభము. ఇవి ఏదో ఒక తాళమునకు లొంగే ఉన్నవి.

ఉత్పలమాల చంపకమాల పాదములు చతురస్రగతి చతురస్రజాతి త్రిపటతాళమునకు సరిపోవును. శార్దూలమత్తేభములు మఠ్యతాళమునకు చదువవచ్చును.

ఇటువంటివృత్తములు విశేషముగా లేవు. ప్రస్తరించి కల్పించుట కూడా కష్టముగానే ఉన్నది. శోధనకోసము నేను వ్రాసినవాటిలో ఒకటి చూపిస్తున్నాను.

కవికాంత

శూరుఁడు వీర్యపరాక్రమోన్నతుఁడు +
                   సుశ్లోకుండు జనార్దనుండు కం
సారి మురాసురవైరి మాధవుఁడు +
                   సౌమ్యుం డంచు హరి న్నుతింపఁగా
భారనమ స్జగ ముంచి విశ్వయతి +
                   పాటింపన్ గవికాంత యాకృతిన్
సూరిజనస్తుతవృత్తమై తనరు +
                   సొంపారన్ గవి చెప్పఁ గల్గినన్.

ఇది ఆకృతి యనే 22 వ ఛందమున పుట్టిన 141279 వ వృత్తము. ప్రతిపాదము చతురస్రగతి ఆదితాళమునకు సరిపోవును.