ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. తెలుగు మధ్యాక్కరకు లక్షణముబట్టి సరిపోయిన కన్నడవు దొరెయక్కరలో చివరనున్న బ్రహ్మగణము అంతమందు గురువుగలదిగా ఉండవలెనన్న నియమమే ఉన్నది. అంటే గగమో సగణమో కావలెను. ఇందులో విష్ణుగణములు మాత్రము 4 గాని, 5 గాని మాత్రలుగల గణము కావలెనన్నారు గనుక తెలుగున ఉన్న ఇంద్రగణములే అగును.

నాగవర్మ కన్నడఛందములో లక్ష్యముగా ఇచ్చిన యక్కరలలో పాదాదినుండే బ్రహ్మగణములు మూడుమాత్రల గణములుగానే ఉన్నవి; గాని దొరెయక్కరలలో నడుమనున్న బ్రహ్మగణములు కొన్ని గగములున్ను, కొన్ని సగణములున్ను అయి ఉన్నవి.

3. కన్నడ పిరియక్కరల సరిపాదములందు 6 వ గణము బ్రహ్మగణము కావలెనన్న నియమమున్నది. అటువంటి విశేషలక్షణము మహాక్కరలందున్నట్లు కవిజనాశ్రయములో చెప్పలేదు. “రెండును నాలుగుసగు వాసరంబున నర్కుఁడైన, నాదరంబుననెడ సొచ్చునని మహాక్కరంబలుకుదు రార్యులెల్ల” అని అనంతుడును, "రెండవచోట నాలవచోటఁ జిత్రభానుగణంబు గదియుచుండు” అని అప్పకవీయములోను ఉన్నది. ఈవిశేషలక్షణము తెలుగు లాక్షణికుల మతమున ఐచ్ఛికముగా ఉన్నట్లు కనబడుచున్నది.

తెలుగు లాక్షణికులు అందరును ఒక్కలాగుననే మధ్యాక్కరకు లక్షణము చెప్పినారు. (ప్రతిపాదమునను రెండు ఇంద్ర