ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అక్కరలు

అక్కరలు దేశ్యజాతులలో చేరినవి. ఇవి కన్నడమందును గలవు. తెలుగు అక్కరలకు కన్నడపు అక్కరలకు చాలామట్టుకు సాదృశ్యమున్ను కొద్దిగా భేదమున్ను ఉన్నది.

నెం
1

2

3

4

5

తెలుగుపేరు
మహాక్కర

మధ్యాక్కర

మధురాక్కర

అంతరాక్కర

అల్పాక్కర

లక్షణము
సూర్య ఇంద్ర చంద్ర
1+ 5+ 1 = 7
ఇం సూ ఇం సూ
2+ 1+ 2+ 1 = 6
సూ ఇం చం
1+ 3+ 1 =5
సూ ఇం చం
1+ 2+ 1 =4
ఇం చం
2+ 1 =3
కన్నడపుపేరు
పిరియక్కర

దొరెయక్కర

నడువణక్కర

ఎడెయక్కర

కిరియక్కర

వీటిలో మహాక్కరకు పిరియక్కర, అంతరాక్కరకు ఎడెయక్కర, అల్పాక్కరకు కిరియక్కర అనేపేళ్లు సరిగా ఉన్నవి. కాని తక్కినవి సరిగా లేవు. అక్కర లయిదింటిలోను పాదమున ఉన్న గణసంఖ్యను బట్టి నడుమ నున్నది గనుక నడువణక్కర అనేపేరు కన్నడమున అన్వర్థముగా ఉన్నది. అయితే లక్షణమును బట్టి దీనికిసరియైన తెలుగు పేరు మధురాక్కర; అర్థమునుబట్టి సరియైన తెలుగు పేరు మధ్యాక్కర. మధ్యాక్కరకు లక్షణమును బట్టి సరియైన కన్నడము పేరు దొరెయక్కర. దొరెయక్కరనగా సమాన