ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8. వడిసీసము — (అన్ని చోట్లను వడినియమ ముండవలెను; అంతేకాక పాదాదినున్నవర్ణముతో మైత్రిగల వర్ణములే పాదముపొడవున యతిస్థలములందు రావలెను.)

9. విషమసీసము— (ఉత్సాహ, గీతపద్యమున్ను కలిసినది.)

10. సర్వలఘుసీసము— (ఇందులో ఇంద్రగణములకు బదులుగా అయిదు లఘువుల గణము లుండును.)

వీటిలో 3, 4, 6, 7, 8, 9 —సీసభేదములు కవిజనాశ్రయములోను కావ్యాలంకారచూడామణిలోను ఉన్నవి. అయితే 3 వది సరిగా అనంతుడు చెప్పినట్లు లేదు; 8 పాదములలోను ప్రాసాక్షర మొక్కటయితే చాలును; పెద్దపాదముల పశ్చిమార్థములం దీనియమము లేదు.

ఈ రెండు లక్షణగ్రంథములలోను సీసభేదముల విభాగమున్ను లక్షణములున్ను ఒక్కలాగుననే ఉన్నవి గాని, కవిజనాశ్రయములో రెండేసిభేదముల కొకొక్కపద్యమే ఉన్నందున కావ్యాలంకారచూడామణిలో ఉన్నంత స్పష్టముగా లక్షణము లేదు. రెండు గ్రంథములలోను విషమసీసములుగాక తక్కిన అయి