ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాటించినకవి. యుద్ధమల్లుని శాసనమందున్న మధ్యాక్కరలలో నాలుగుగణముల తర్వాతనే వళి ఉన్నది.

కొన్నిపద్యములలో తెలుగులాక్షణికు లందరున్ను చెప్పినస్థలముందుగాక మరియొకచోటను వళి ఉంటే ఎక్కువ బాగుగా ఉండునని నాయభిప్రాయము.

1. జలోద్ధతగతి:—సరోరుహదళాక్ష + శాశ్వతయశా (అనంతుడు), తెలుగులాక్షణికు లందరును ఇట్లే వళి పాటించినారు; గాని' సంస్కృతలాక్షణికుల నియమము పాటించుట మంచిదని నేను వ్రాసినది చూడండి.

సరోజనయనా + జలోద్ధతగతిన్
సరూపగతులన్ + జసంబు జసమున్
జరించు; విరతుల్ + షడర్ణములపై
కరీంద్రవరదా + ఖగేంద్రతురగా

2. ప్రమితాక్షరము:— ‘కమనీయ తేజునిన+గణ్యయశున్' అనంతుడు లాక్షణికు లందరును ఇట్లే 8 తర్వాత వడి ఉంచినారు. గాని 6 త ర్వాత వడి ఉంచి నేను వ్రాసినది చూడండి.

జగదేకదేవ + సజసాయుతమై
ద్విగణాంతమందు + విరమం బమరన్
భగవంతుఁ గొల్వ + ప్రమితాక్షరమై
జగమందు నిల్చు + జలజాక్షహరీ