ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సావర్ణ్యము కొంతవర కుండబట్టే ఈ రెండును ఒకదాని కొకటి వచ్చునంటే, దడలు ఈలాగునే దేశ్యపదములలో కనిపించును గదా; వాటికి మైత్రి ఎందుకు చెప్పరాదు? ఉ. దొంగ, డొంగ; దాపల; డాపల, సంస్కృతమందు తకార మొకప్పుడు టకార మగునుగదా.

5. లడలు, వ బలకు (వ, Σప) అభేదమన్న కారణముచేత మైత్రి అంగీకరించినప్పుడు, రలల కెందుకు మైత్రి ఉండరాదు! (సరిరము, సలిలము; రేఖ, లేఖ)

6. తెలుగులో గవలు, ‘లన'లు కొన్నిమాటలలో మారుచుండును; ఉ. పగడము, పవడము; తెలుఁగు, తెనుఁగు.

వడిస్థలము

సంస్కృతశ్లోకములలో విశ్రాంతి ప్రధానము; ఖండాద్యక్షరమైత్రి కావలెనన్న నియమము లేదు. తెలుగు పద్యములలో ఖండాద్యక్షరమైత్రి ప్రధానము. విశ్రాంతి (అనగా పదము ముగియవలెనన్న) నియమము లేదు. విశ్రాంతి ఐచ్ఛికముగా ఉండుటవల్ల మేలే కలిగినదని చెప్పవచ్చును. అన్నిపాదములలోను విశ్రాంతి ఒక్కచోటనే ఉండుటకంటె మారుతూ ఉంటే పద్యము రసోచితముగా ఉండుటకు వీలుండును. అక్షరమైత్రి కావలెనని కోరేవారు విశ్రాంతిస్థలమందు వడిపాటించుట మంచిదే కాని విశ్రాంతిస్థలమును నిర్ణయించుటలో రసజ్ఞు లైనకవులు తమస్వాతంత్య్రము చెడగొట్టుకోకూడదని నామతము.

లక్షణసూత్రములు మీరరానివన్నట్లున్నా కవులు కొద్దిగా స్వాతంత్ర్యమును చూపించకపోలేదు. సంస్కృతలాక్షణికులు