ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వళ్లభేదములన్నీ సమాకలనము చేసి ఈదిగువగుర్తు లుంచి తెలుపుచున్నాను.

1. అ=ఐ=ఔ
2. ఇ=ఎ, ర్(ఇ,ఎ), =ఋ=కృ=వృ
3. ఌ=ల్, ళ్ (ఇ,ఎ)
4. ఉ=ఒ
5. Σక్; (వర్గులకు ఇట్లే);
6. Σచ్=శ్=ష్=స్
7. Σంక్=ఙ్
8. Σంచ్=ఞ్
9.Σంత్=ంట్=న్=ణ్
10. Σంప్=Σంయ్=మ్
11. Σప్(ఉ,ఒ)=మ్(ఉ,ఒ)
(=మైత్రికి గురుతు; హ్రస్వస్వరమునుబట్టి దీర్ఘస్వరమునుకూడా ఉన్నట్లే ఊహించవలెను.)
(ఋకార మే వ్యంజనముపై ఉన్నా విడిగాఉన్న స్వరమువలె పాటించవచ్చును.)
(ఇ ఈ ఎ ఏ లం గూడిన లళలే అని అర్థము.)

(Σ అనునాసికము కాక తక్కిన వర్గాక్షరములు నాలుగన్ను అని తెలియజేసే గురుతు. ఆనాలుగున్ను అన్యోన్యమైత్రి గలవి అని అర్థము.)



(Σయ్ అంటే యరలవశషసహలు 8న్ని)