ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సొరిది క్షకారముఁ గూడఁగ
సరి నేఁబది యయ్యె వర్ణసంఖ్య ధరిత్రిన్‌.

124


క.

ళలలకు భేదము లే దను
పలుకుఁన ళాఁ దొలఁగి యైదుపదులగు వర్ణం
బులు సంస్కృతభాషకు మఱి
తెలుఁగున ఱళ లనఁగ రెం డధిక మండ్రు హరీ!

125


గీ.

రాఁదొలంగి సమస్తాక్షరముల మీఁదఁ
గార మగుఁ గకారంబు క్షకార మనఁగ
నట రవర్ణంబుపై నిఫ యనఁగఁ బరఁగుఁ
గాన నిది రేఫ యని పలుకంగవలయు.

126


క.

వర్ణం బన నక్షర మన
నర్ణం బన మాతృక యన నక్కర మనఁగా
నిర్ణీత సమాహ్వయములు
వర్ణితములు కృతులయందు వ్రాలకునెల్లన్‌.

127


క.

ఆదులు వర్గత్రయమును
భూదేవతలు తపవర్గములు రవలును ధా
త్రీదయితులు యలశషసహ
లాదటనూరుజులు ళక్షరాఖ్యలు శూద్రుల్‌.

128

మఱియు షడ్వర్గంబులు—

క.

ఏకాదిషడంతముగన్‌
బ్రాకటపాదములు గలుగు మంజరి మొద లా