ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క్తులు లేకవ్యయశబ్దం
బులు సకలము సముచితార్థములు విలసిల్లున్‌.

114


గీ.

నెఱయ నవ్యయపదములన్నియు సమాస
రూపమున నాంధ్రకవితకు రుచి యొనర్చు
స్వర్వధూమణి యన వృథాశంక యనఁ బు
నః ప్రణత నాఁగ నుచ్చైర్నినాద మనఁగ.

115


క.

వృథ యను నవ్యయ మొక్కఁడు
ప్రథితంబై చెల్లుఁ గృతులఁ బ్రత్యేకము తా
వృథసేయక యెపుడు మనో
రథములు మాకిచ్చు నీ మురద్విషుఁ డనఁగన్‌.

116


క.

కారకజనితక్రియయును
నారఁగ ల్యప్ప్రత్యయాది కావ్యయము దెనుం
గైరంజిలుఁ బూజించి వి
చారించి యుదాహరించి సంధించి యనన్‌.

117

మఱి విశేష్యవిశేషణంబులు—

క.

హరి కరుణాకరుఁ డనఁగా
హరి యనుశబ్దము విశేష్య మగు మఱి కరుణా
కరుఁ డనుట విశేషణ మి
ట్లురుతరగతిఁ గారకప్రయోగము లమరున్‌.

118

మఱి క్రియావిశేషణంబులు—

క.

పగతునితమ్ముని శాశ్వత
ముగ నిల్పెను దశరథేంద్రపుత్త్రుండనుచో