ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అవ్యయీభావసమాసము—

క.

ఎక్కడ నెయ్యవి లే వవి
యిక్కడ లే వనిన నవ్యయీభావము దా
నెక్కొను నిర్మక్షిక మని
యక్కజ మగుఁ దీర్ఘ మహిమ నభినుతి సేయన్‌.

101


వ.

మఱియు నుత్తరపదోపమానసమాసం బెట్టి దనిన.


గీ.

ఓలిఁబురుషసింహో యని యుగ్గడించు
చోటఁ దా సింహఇవపురుషో యనంగఁ
దనరు నిగ్రహ మగుట నుత్తరపదోప
మానసమాస మండ్రిది శాస్త్రమహిమవిదులు.

102

మఱియుఁ గారకశబ్దంబులు—

గీ.

సంస్కృతము తెనుఁ గైనఁ దత్సమపదంబు
దానఁ బుట్టి తెనుంగైనఁ దద్భవంబు
దేశి తెనుఁగు దేశజ మచ్చ తెనుఁగు తెనుఁగు
నిర్మలుఁడ సిరి యొడయఁడు నిక్క మనఁగ

103


గీ.

సర్వనామముల్‌ యుష్మదస్మత్పదంబు
లావిభక్తులక్రియ లవ్యయములు మానుఁ
దెలుఁగు లగుచోటఁ గారకాదిని వసించి
సర్వనామాశ్రయంబులు జరుగుఁ కొన్ని.

104


సీ.

ఏనన్న నీవన్న నితఁడన్న బ్రథమాఖ్య
           నను నిన్ను నాతని నన ద్వితీయ
నతనిచే నతనితో ననఁగ దృతీయ యీ
           తనికొఱ కతనికై యనఁ జతుర్థి