ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ప్రకటవిసర్గాదిస్వర
మకారమునఁ గలసి యోత్వ మగు సంధిఁ దపో
ధికుఁ డన విసర్గ చెడి వా
క్ప్రకార మాప్రభృతిఁ గదిసి రజఆప్తి యగున్‌.

74


క.

కలితేకారాదివిస
ర్గులు స్వరములమీఁదఁ గదియఁగా రేఫలు సం
ధిలు నర్చిరగ్ర మనఁగా
నలవడు మఱి చక్షురింద్రియం బనఁగ మహిన్‌.

75


గీ.

వర్గములఁ దృతీయచతుర్థ వర్ణములును
ణనమలును యరలహవలు నొనరఁ గదియ
వామపదవిసర్గాంతిమాద్వర్ణ మోత్వ
మగు రజోగుణమన మనోహర మనంగ.

76


క.

వెలయ నివర్ణాదివిస
ర్గలమీఁదను రేఫ గదియఁగా దీర్ఘము వ
ట్రిలి యర్చీరాజి యనఁగ
నలిఁ జక్షూరాగ మనఁ దనర్చును సంధిన్‌.

77


క.

ధర నవ్యయపు విసర్గకుఁ
బరమున నచ్చున్నఁ గుఱుచపై రేఫ యగున్‌
పరరేఫ గదియ దీర్ఘ
స్వర మగు స్వరధీశుఁ డనఁగ స్వారాజ్య మనన్‌.

78


గీ.

ప్రథమశబ్దాంత దీర్ఘవర్ణములమీదఁ
జతనమైన రేఫాంత విసర్గ యుండి