ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చపటహల్లులు మూఁటను జను విభాష
ఛత్వమగుఁ దకారమునఁ దచ్ఛాఖయనఁగ.

62


గీ.

లలిని దద్వ్యంజనంబుపై లత్వమునకు
ద్విగతి తల్లీల యనఁగఁ దద్లీల యనఁగ
నంచితసకార మడఁగును నడఁగును నడఁగకుండు
నుత్థితం బుత్‌స్థితం బన నుండుఁగాన.

63


క.

అనునాసికవర్గ వ్యం
జనముల నిజరూప మొండె జరగుఁ దృతీయం
బునఁ బ్రాఙ్ముఖంబు ప్రాగ్ముఖ
మన వాఙ్నియమంబు వాగ్నియ మమనుచోటన్‌.

64


గీ.

కచటతపహల్లు పంచవర్గద్వివర్ణ
సలనిజాకృతి మీఁదియక్షరయుగముల
యరలవలఁ దృతీయంబు వాక్తరుణివాక్స
రంబు లనఁగ దృగ్దీప్తి దృగ్వ్రాత మనఁగ.

65


గీ.

కపల ప్రథమయుగ్మ సకారగతులఁ దాన
అపరయుగ యరలవతృతీయంబు తత్కృ
తంబు తత్పుత్రి తత్సతి తద్గతియు జ
గద్గురుఁడు సద్యశము నాఁ దకారహల్లు.

66


గీ.

తచ్చమత్కృతి తచ్ఛాయ తజ్జలంబు
తజ్ఝషము తట్టణాంకృతి తట్ఠకార
ఘనతతడ్డోల తడ్ఢక్క యనఁగ రెండు
వర్గముల ద్విత్వమొందుఁ దద్వ్యంజనమున.

67

విసర్గసంధి—

క.

కపముఖయుగ్మములు విస
ర్గపయిం బొడసూపి నిర్వకార మగు మనః