ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

సంధిఁ దెలిపెడుచో సూత్రసమ్మతముగఁ
దొలుతఁ బలికి చూపెడు వర్ణముల విసంధి
నాటుకొనదు శ్లిష్టోచ్ఛారణంబుఁజేసి
చూపునదియ నిశ్చయసంధిసూచకంబు.

37

షట్సంధులు—

గీ.

పరఁగు దుక్సంధి స్వరసంధి ప్రకృతిభావ
సంధి వ్యజనసంధి విసర్గసంధి
స్వాదిసంధి నా షట్సంధు లందులోనఁ
బ్రకృతసంధి యన్నది యాంధ్రభాషఁ జొరదు.

38

తుక్సంధి—

క.

పదమధ్యదీర్ఘలఘువులు
పదాంతలఘువులు ఛకారపరమై యూఁదున్‌
మది మ్లేచ్ఛుఁడు తుచ్ఛుం డనఁ
ద్రిదశ చ్ఛత్ర మననీగతిని దుక్సంధిన్‌.

39


గీ.

లలిఁ బదాంతదీర్ఘము వికల్పంబు నొందుఁ
బుత్త్రి కాచ్ఛత్ర మాత్మజాఛత్ర మనఁగ
నటఁ బదాంతదీర్ఘం బయ్యు నాఙ్ప్రయుక్తి
నిత్య మాచ్ఛాదనం బని నెఱయ నూఁదు.

40

స్వరసంధి—

క.

ధర అఇఉఋలు సవర్ణము
పర మగుచో దీర్ఘ మగు సువర్ణాద్రి యనన్‌
శరధీంద్రుఁ డన జహూదక
సరసి యనఁ బితౄణములు వెసం దీర్పు మనన్‌.

41