ఈ పుట అచ్చుదిద్దబడ్డది


భూత్వా మెలఁగెడు నన్నఁగ
విత్వవిదులు దుష్ప్రయోగవిధ మండ్రు హరీ!

26


వ.

సంస్కృత విభక్తులయ్యును దెనుఁగునకుఁ జెల్లు
సుప్రయోగంబెట్టి దనిన.

27


క.

నిక్క మగు సుప్రయోగము
ధిక్కృతదురితాయ భగవతేఽస్తు నమో యం
చక్కడ నీకును నమరులు
మ్రొక్కుదు రని తిఙ్సుబంతములఁ గూర్ప హరీ!

28

విరోధములు—

క.

సమయవిరోధమ్మును నా
గమలోక విరుద్ధములును గాలవిరోధ
క్రమము కళాదేశవిరో
ధములును జొరకుండఁ జెప్పఁదగుఁ గృతుల హరీ!

29

సమయవిరోధము—

క.

సందులఁ గుండలముల్‌ గుడి
సందిని శివలింగమును నొసల భూతియుఁ బెం
పొందఁగ నొకదరిబేసి మ
రుం దెగడెడు నన సమయవిరోధము కృష్ణా!

30

ఆగమవిరోధము—

క.

ఎక్కడిధర్మము హింసయ
నిక్క మనుచు వృత్రవధకు నిర్జరపతియుం
ద్రొక్కె దయపేర్మి ననవుడు
నక్కడ నాగమవిరోధ మండ్రు ముకుందా!

31