ఈ పుట అచ్చుదిద్దబడ్డది

1. ఛందోభంగము—

క.

ఛందోభంగం బగు గురు
వొందెడునెడ లఘువుగాఁ బ్రయోగించుట గో
వింద యనిపలుకుచోట ము
కుంద యనుచుఁ బలుక నిట్లు కుంజరవరదా!

4

2. యతి భంగము—

ఆ.

విమల కమలనేత్ర విశ్వలోకస్తోత్ర
విమలదైత్యకులవినాశ యనుచు
వలయుచోట లేక వడి యొండుచోనుండఁ
బలికిరేని నియతిభంగ మండ్రు.

5

3. విసంధికము—

గీ.

అమృత ఉదధిశయన అమర ఈశానుజ
అబ్జమందిరాస్య అబ్జమిత్ర
అనుచు నిట్లు సంధి నెనయని శబ్దముల్‌
దొరకుటయ విసంధిదోష మండ్రు.

6

4. పునరుక్తము—

గీ.

తొలుతఁ దా నెద్దియైననుబలికి మఱియు
నదియ పలికినఁ బునరుక్తి యండ్రు బుధులు
శబ్ద పునరుక్తి పూర్వోక్తమైన శబ్దమైన
నర్థపునరుక్తి యేకార్థమైనఁ గృష్ణ!

7


గీ.

శబ్దపునరుక్తి యగుఁ గాంతిచంద్రుఁ డని వ
చించి మఱి కాంతి చంద్రుఁ డటంచుఁ బలుక