ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

మునుగలయొండు రెండునిటమూఁడుగ మూఁడును రెండునైదునై
దును నట నాల్గుతొమ్మిదగుఁదొమ్మిదినెన్మిదియుం బదేడుగా
ననువగు పంక్తి రెండు మొదలైనవి నాల్గిట నాలుగాదిగా
నెనిమిదియుం దదాదికము లెల్లఁ బబాఱిటఁ గూడఁగా నగున్‌.

75

లగక్రియాచక్రము అధ్వప్రక్రియ—

క.

తిరముగ ఛందోఽక్షరములు
నురుతరముగ వృత్తసంఖ్యయను ద్విగుణము లై
పొరి నొక్కొక్కఁడు తొలఁగఁగఁ
బరిశిష్టాంగుళము లధ్వభాగ ముపేంద్రా!

76

సమవృత్తంబుల వెఱసు—

క.

కడపటి వృత్తంబుల యిను
మడి లోపలఁ బ్రథమ వృత్తమండలిఁ దీర్పన్‌
వడినిష్టచ్ఛందంబులఁ
బొడమిన వృత్తముల వెఱసు పొలుపగుఁ గృష్ణా!

77

మఱియు ఛందోవృత్తముల వెఱసు—

చ.

ఒగిఁ బదుమూఁడు కోటులును నొప్పుగనల్వది రెండులక్షల్‌
దగఁ బదునేడు వేలు నుచితముగ నవ్వల నేడునూటిపై
నగణితవైభవా యిరువదాఱు గదా సమవృత్తభేదముల్‌
ప్రగుణితలక్షణస్ఫురణఁ బంచిన ఛందము లిర్వదాఱిటన్‌.

78

గద్యము
ఇది శ్రీవాణీవరప్రసాదలబ్ధవాగ్విభవ తిక్కనామాత్య తనుసంభవ సుకవిజనవిధేయ అనంత
నామధేయ ప్రణీతం బైన ఛందోదర్పణంబునందు జాతిలక్షణలక్షితంబు లగు కందంబు