ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మఱి ద్విపద—

ఇంద్రులు మువ్వురు నినుఁ డొక్కరుండు
సాంద్రమై యొక్కొక్కచరణంబుఁ గొలువ
నలరుఁ బద్మోదరుఁ డంచు ధీరోత్త
ములు విస్తరింతురు ముదముతో ద్విపద.

48

మంజరీ (ప్రాసరహిత)ద్విపద—

శ్రీమందిరాకారు జితదైత్యధీరుఁ
గీర్తించుచోఁ బుణ్యవర్తనుం డనుచు
యతిమాఱుప్రాస మి ట్లచ్చోట నిడక
సరసిజనాభాయ సముదగ్రసాహ
సాయ నమోయంచు శబ్దమొక్కటియు
రెండుపాదముల నీక్రియఁ బంచియిడక
వెలయు ప్రాసములేని ద్విపద యై పరఁగఁ
బూజింపవలయును వాక్పుష్పమంజరుల.

49

మఱియుఁ జౌపదము—

కలసి చతుర్లఘుగణములయందు
నలిఁ ద్రిగణం బై నగణము వొందు
నలరుగణద్వయ యతిగోవిందుఁ
బలుకఁ గృతులఁ జౌపద చెలువందు.

50

అందు వితాళమనుజౌపదము—

అర్కనామగణ మనువుగ రెండు
దార్కొని లఘువొందఁగ నిట్లుండుఁ