ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఆశ్రితావనలోలుఁ డాభీరకాంతాకు
           చాగ్రకుంకుమభూషితాంగుఁ డితఁడు
ఆశ్రాంతజయధాముఁ డాశాంతవిశ్రాంత
           యశుఁడు ధరాధరశ్యాముఁ డితఁడు
విశ్రుతవిభవుండు విపులబలాఢ్యుండు
           వికసితవదనారవిందు డితఁడు


గీ.

అనుచు మునులును దివిజులు నభినుతింపఁ
జూపుచెవులపాన్పున వెన్ను మోపియుండు
నంబుజోదరుఁ డంచు ని ట్లాంధ్రకృతులఁ
జెప్పిరేని వృత్తప్రాససీస మగును.

28

సర్వతఃప్రాససీసము—

నీరదవర్ణుండు నీరేరుహాక్షుండు
           నీరధిబంధనోదారబలుండు
కారుణ్యరసరాశి గౌరీరసజ్ఞావి
           హారి శోభితనామగౌరవుండు
ధీరుండు త్రిభువనాధారుండు దశరథ
           క్ష్మారమణేంద్రకుమారవరుఁడు
మారీచదమనుండు నారాచవిద్యావి
           శారదుం డసురవిదారణుండు


గీ.

ధారుణీసుత నయనచకోరసరసి
జారి యన సర్వతఃప్రాసచారుసీస
మారయఁగ సత్కవిజనవిస్ఫారనుతులఁ
దేరు శ్రీపద్మనాభ శృంగారసార!

29