ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దగుఁ జతుర్థగణముపై నుదాత్తవిశ్రమంబు
నిగుడుమేలనాఖ్య గీతి నెరయుఁ బ్రాస మొదవి.

18

సమగీతులందు ఆటవెలఁది—

ఇనులు ముగురు పాడ నిద్ద రింద్రులు మృదం
గములు దాల్ప వంశకాహళాదు
లేగురర్కు లూఁద నిరుమేళగతి నాట
వెలఁది యొప్పుచుండు విష్ణుసభల.

19

తేటగీతి—

ఒక్కఁ డర్కుఁ డిద్దఱుజిష్ణు లొనర మఱియు
నిద్ద ఱర్కు లీచొప్పున నేగురేసి
నాల్గువంకలఁ గదిసి వర్ణన మొనర్పఁ
తేటగీతి విష్ణునిపేర్మిఁ దేటపఱుచు.

20


క.

పెనఁగి గణత్రియతముపై
నొనరఁగ వడియొండెఁ బ్రాసమొండెను నిలుపన్‌
జను నాటవెలఁది యందును
ననువొందిన తేటగీతి యందు ముకుందా!

21

మఱియు సీసంబులు—

క.

నలనగసలభరతలలో
పల నాఱును మీఁద రెండుఁ బద్మాప్తగణం
బులఁ దగి నాలుగుపదములఁ
జెలు వగు నొకగీతితోడ సీసము కృష్ణా!

22


క.

సీసము రెండుగణంబులఁ
బ్రాసం బేనియును మఱి విరామంబైనన్‌