ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శిఖరిణి, పృథ్వి మొదలయిన వృత్తలక్ష్యపద్యములు అనంతుని పద్యములలోని పదములతో కనబడుచున్నవి. వీటిలో ఒక్కటి చూడండి:--

అజశివశక్రనిరంతరార్చితపద్ద్వయున్
భుజగకులాధిపతల్పుఁ బూని నుతింపగా
నజయతినొంది నజాభరార్చితమై చనున్
ఋజువగు నుర్వి మనోజ్ఞఋష్యనురాగమై.

అనంతునిది.

అజమృడవాసవసంతతార్చితపాదపం
కజయుగళున్ హరినిర్వికారు మనోజ్ఞనా
ఋజువగు వృత్తమునందు బ్రీతి నుతింపగా
నజజభరంబులు వొల్చు నచ్చిన దిగ్యతిన్

అప్పకవిది.

ఈలాగున అనంతుడు కవిజనాశ్రయము ఎదుట నుంచుకొని తన ఛందోదర్పణమును వ్రాసియుండునేమో అని ఎంతపరిశీలించి చూచినను పద్యములలో పోలిక ఎక్కడనయినను కనబడలేదు.

కవిజనాశ్రయముకంటె ఛందోదర్పణము పెద్దగ్రంథము. కవిజనాశ్రయములో సంజ్ఞాధికారమందు గణఫలములు, గణగోత్రములు, గణలింగములు, బీజాక్షరములు మొదలయిన విషయముల గురించి 35 పద్యము లున్నవి. ఛందోదర్పణములో వీటిలో ముఖ్యమైన విషయములు గురించి 6 పద్యములు మాత్రమే ఉన్నవి. గాని వళ్లు, ప్రాసములు, షట్ప్రత్యయములు... వీటిగు