ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చే ఆ వ్యాపారి "కచ్చితంగా రెండేళ్ళు గ్యారంటీ" ఇచ్చి అమ్ముతాడు. తీరాచూస్తే రెండు రోజులకే విసనకర్ర విరిగిపోతే విసుగెత్తిన కస్టమర్ పిలిచి ఆ విషయం చెప్పి కడిగేస్తాడు. తన విసనకర్ర మంచి క్వాలిటీ ఉన్నది, మీకే వాడుకోవడం వచ్చి ఉండదు అంటూ "ఇంతకీ ఎలా వాడారు" అని అడుగుతాడు వ్యాపారి. విసనకర్రతో విసురుకొని చూపిస్తాడు కస్టమర్. అదండీ జరిగిన విషయం అలా కాదు ఇలా వాడాలి అంటూ చేయి (విసనకర్రగా ఇమిటేట్ చేసి) ముందుపెట్టి తల అడ్డంగా ఊపుతాడు. ఈ స్కిట్ ప్రసిద్ద వేదికలపై దాదాపుగా 1980 నుంచి వందసార్లకు పైగా వ్యాపారి వేషం వేసి పగలబడి నవ్వించారు రమణ.

ఎమ్మెల్యే కాకముందు నుంచీ నాని స్కిట్‌ను చూసి చాలా ఇష్టపడేవారు. ఓసారి సింగపూరు, మలేషియాల్లో తెలుగువారి సాంస్కృతిక కార్యక్రమాలకు అతిధిగా వెళ్లిన ఈలి ఈ స్కిట్ అభినయించారు. ఆ వేదిక నవ్వులు, కరతాళధ్వనులతో మార్మోగింది. ఎందరో తెలుగువారు నానికి స్నేహితులు, అభిమానులు అయ్యారు.

తిరిగి వచ్చాక ఓ సందర్భంలో గూడెంలోని కళావేదికపై మాట్లాడుతూ ఈ విషయం పంచుకున్నారు. రమణకు అప్పటినుంచీ చేయి విసనకర్రలా పెట్టి తల అడ్డంగా ఊపుతూ అభివాదం చేయడం ప్రారంబించారు. "లేకపోతే విరిగిపోతుంది, విసినికర్ర" అంటూ ఆ జోకు గుర్తుచేస్తారు. ఈ నమస్కారం ఆయనకు మాత్రమే కాదు ఆయనలోని కళాకారుడికి అంటారు నాని.