ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పాఠశాలకు మూడు వైపులా కాంపౌండ్ వాల్ ఉన్నా ఒకవైపు మాత్రం ఉండేది కాదు. ఈ సమస్య ఎలాగైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలని ఆయన ఆలోచన, ఎప్పుడైనా సమావేశాల్లో ప్రస్తావిద్దామంటే అటువంటి పాఠశాలలు ఎన్నో ఉన్నాయని, మా పాఠశాల ఉన్నంతలో చాలా బాగున్నదని ఎవరైనా అనే అవకాశం ఉంటుంది. అది నిజమే కూడా. అలాగని వదిలేసే సమస్య కాదు. ఏదోవిధంగా ప్రజల సహకారంతో నిర్మిద్దామంటే పెద్దపని. అప్పుడు తాడేపల్లిగూడెంలోని సైన్స్‌ఫెయిర్‌ను ఉపయోగించుకోవాలని ప్రణాళిక వేసారు. అందులో ప్రదర్శించేందుకు మా స్కూలు మోడల్, నిర్మించబోయే పోలవరం ప్రణాళిక మోడల్ తయారుచేస్తున్నాము. మా పాఠశాల మోడల్ తయారుచేసినప్పుదు ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. దాన్ని అమలుచేసాక తప్పకుండా మన సమస్య కలెక్టర్‌గారి దృష్టిలోపడుతుంది చూడండి అని ధీమాగా చెప్పారు. కలెక్టర్ మా మోడల్ చూసి చాలా ఇంప్రస్ అయ్యారు. బాగుందే. స్కూలు ఇలానే ఉంటుందా అని అడిగారు. ఎం. ఇ. ఓ. గారు అవును, అచ్చంగా అలాగే ఉంటుందని ఉత్సాహంగా బదులు ఇచ్చారు.