పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/53

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంగీత ముద్భవిస్తున్నదో, సంగీత మహా ప్రవాహంలో అవి కదులుతున్నవో? ఆ ప్రభువు కంఠము హృషీ కేశంలోని గంగాప్రవాహంలా గంభీరం.

      “నిత్యమృత్యువు జగము ప్రాణులు
       నిత్యజీవము జగము ప్రాణులు
       మృత్యువున జీవమ్ము నిత్యము
       అమృతత్వ మనంత విశ్వపు
       నిత్య లీలయట!”

(18)

వసంతుడై శ్రీ వీరపురుషదత్తకుమారప్రభువు వనదేవతను వరించాలి. అతనిని వసంత దేవునిగా బాలికలందరూ అలంకరించారు. పూవుల కంఠమాలలు, పూవుల దండకడియాలు, కంకణాలు, పూవుల మొలనూలు, పూవుల మంజీరాలు, చిత్రచిత్ర రూపాలుగా రచించి, యువరాజును పూవుల ఆసనంపై అధివసింప జేసినారు. అతని చూట్టూ ఆ బాలికలు నాట్యంచేస్తూ కళ లుట్టిపడ రచించిన పూలకిరీట ముంచినారు.

       “జయ జయ జయ జయవసంత
          జయ మధుదేవా
          జయ వసంత
          జయ నవజీవిత రథసారధి
                  రావోయీ స్వప్న మూర్తి
                  రావోయీ కామమూర్తి.
          విరియబోవు హృదయకుసుమ
          దళములలో గంధమూర్తి
                  రావోయీ!
                  రావోయీ!
          జయ జయ జయ జయవసంత
          జయ మధుదేవా!
          లోకంలో శ్రుతి ఉందో
          రాకాసగు శ్రుతిభంగమొ
                  ఓ మధుమాసాధిప
                  మా మనసులు వికల మొందె
                  జయ జయ జయ జయవసంత
                  జయ మధుదేవా!
          గజ గజ వణకించు నెలలు
          గడచినవయ్యా నేటికి

అడివి బాపిరాజు రచనలు - 6

45

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)