ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15. బౌద్ధుల ఖగోళ పరిశోధనలు - 2

గత సంచిక తరువాయి

ఆకాశగోళం - దిక్చక్రం:

ఒక రాశిలో కన్పించే విషువత్‌, తిరిగి అదే రాశిలోకి రావడానికి పట్టేకాలం 26వేల సంవత్సరాలు. మన జీవితకాలం గట్టిగా 70 ఏళ్ళు. లేదా తీసుకు తీసుకు బతికితే వందేళ్లు. ఒక రాశిని పూర్తి చేయడానికి 2150 సంవత్సరాలు. అంటే...విషువత్తులు ఆయనాంతాల మార్పు గమనించడానికి కనీసం 2000 సంవత్సరాలు కావాలి. అంటే... 600 తరాల కాలంలో ఈ మార్పు గమనించడం సాధ్యం. మొత్తం వృత్తానికి 3600 లు అనుకుంటే - ఒకరాశికి ౩00 లు. 12 రాశులకుగాను 3600 లకు 26 వేల సంవత్సరాలు అనుకుంటే - ఒకరాశికి 300 లకు 2150 సంవత్సరాలు. అందులో 10 కి 72 సంవత్సరాలు. మనిషి తన 70 ఏళ్ళ కాలంలో విషువత్తుల్లోని 10 మార్పుని మాత్రం గమనించగలడు. ఈ 10 ని నక్షత్ర పాదాల్లోకి మారిస్తే..ఒక నక్షత్రం నుండి మరో నక్షత్రానికి మారడానికే వెయ్యేళ్ళు పడుతుంది.

ఇంత సూక్ష్మమైన మార్పుని గమనించడం ఒక ఎత్తు అయితే, దీనికి కారణం కనుగొనడం మరో ఎత్తు. కారణం వారికి తెలియక పోవచ్చు. కానీ, మార్పుని గమనించడం మాత్రం జరిగింది.

ఈ మార్పుని గమనించిన తాలూకు మొట్టమొదటి ఆనమాలు నిదానకథలో మనం చెప్పుకున్న 'దిక్‌ చక్రం' విషయంలో కన్పిస్తుంది.

మనకి ఇప్పటిదాకా బాగా తెలిసిన భూచలనాలు రెండే.

ఒకటి. : భూ ఆత్మభ్రమణం (తన చుట్టూ తను తిరగడం)

రెండు : భూ పరిభ్రమణం (భూమి సూర్యుని చుట్టూ తిరగడం)

ఇవికాక మూడో చలనం విషువత్‌ చలనం. భూమి గిరగిరా తిరుగుతూ వేగం ఆగి పోయి, పడిపోబోయే ముందు బొంగరం ఎలా తూలుతూ చుట్టూ తిరుగుతుందో అలా తిరిగే చలనమే ఈ మూడో చలనమైన విషువత్‌ చలనం. ఇలా ఒక తూలుడు చలనాన్ని పూర్తి చేయడానికి 26 వేల సంవత్సరాలు పడుతుంది. ఈ 26 వేల సంవత్సరాలలో వంగి ఉన్న భూ అక్షం సూర్యునికి ఒకసారి అటూ, ఒకసారి ఇటూ తిరుగుతుంది. దీనివల్ల వాతావరణాల్లో, బుతువుల్లో మార్పులు వస్తాయి. ఋతువులన్నీ వెనక్కి నడుస్తాయి. ఇప్పుడు వేసవి ఉన్న ఋతుకాలంలో 15వేల సంవత్సరాలకు శీతాకాలం ఉంటుంది. అలా ఒక్కో ఋతువు వెనక్కి వెళ్లి... వెళ్ళి మరలా 26 వేల సంవత్సరాలకి అదే స్థానంలోకి వస్తుంది.

మనం ఆకాశంలో ఆ స్థానాల్ని గుర్తు పట్టలేం. కాబట్టి సూర్యుని వల్ల భూమ్మీద ఏర్పడే విషువత్తుల ద్వారా, అవి వెనక్కి జరిగే ప్రక్రియ ద్వారా ఆ మార్చును, గమనించగలం. అందుకే ఈ చలనాన్ని విషువత్ ‌ చలనం అంటారు. విషువత్తుల, ఋతువుల మార్పుని గమనించడమే ఈచలనాన్ని తెలుసు కోవడం.

విషువత్తులతో పాటు ఆయనాంతాలు కూడా మారతాయి. ఆయన ప్రాంతాల మీద నివసించే ప్రజలకి కనిపించే ఆకాశం తీరే - దిక్‌ చక్రం. మనం సాయంత్రం వేళ ఆయన రేఖపై నిలబడి ఆకాశాన్ని చూస్తే నక్షత్రాల వంకర చలనకాలు కన్పిస్తాయి. అక్కడి నుండి ధృవ నక్షత్రాన్ని చూస్తే ఆకాశంలో, రాశులు, నక్షత్రాలు అన్ని దిక్కులకూ సమానంగా ఉన్నాయా? లేదా?, ఏదైన దిక్కుకేసి వంగి ఉన్నాయా? అనేది కూడా కన్పిస్తుంది. ఏ రోజున, ఏదిక్కున ఆకాశం (ఆకాశగోళం), భూమికి సమాంతరంగా ఉంటుందో అదే సరైన దిక్‌ చక్రం -(పటం -1 చూడండి)

ప్రస్తుతం వసంత విషువత్తు మీనరాశిలో జరుగుతుంది. అంటే సూర్యుడి మీనరాశిలో ఉన్నప్పుడు మనకి వసంత విషువత్‌ అన్నమాట. అంటే...సూర్యుడు తన ఉత్తరాయన కాలంలో భూమద్యరేఖ మీదకు వస్తాడు. అప్పుడు భూమధ్యరేఖ మీదుగా ఆకాశగోళంలో మీన రాశి ఉంటుంది.

42

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి జూలై 2018