ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాల్పనికమైనపని. పాఠకుడు గూడా పఠనంలో చైతన్యవంతమైన బాధ్యతను పోషించి తీరాలి. అయితే టీవీ చూడడంలో అటువంటి చైతన్య వంతమైన అప్రమత్తత అవసరం లేదు. టీవీ తెరముందు కూర్చుని హృదయాన్నీ మేధస్సునూ దానికే అప్పగించి, నిర్మోహంగా, నిస్తేజంగా కాలహరణం చేయడంలో మానవుడికుండే ఆనందం చైతన్యవంతమైన పుస్తక వఠనంలో వుండదు. యీ రెండింటికీ మధ్య వుండే తేడాను గ్రహించగలిగిన వారే పుస్తక పఠనంలో వుండే గొప్పతనాన్ని గుర్తించ గలడు. అయితే ఆ స్థితిని చేరగలిగే వ్యక్తులు తక్కువగావడంచేతనే పుస్తక పఠనం తగ్గిపోతోంది.

పుస్తకం మనిషి మేధస్సుకు సవాలుగా యెదుగుతుంది. అదే పుస్తకాన్ని యెంత గొప్పగా దృశ్యమాన మాధ్యమంగా మార్చినా ఆ పుస్తకానికున్న గొప్పతనం ఆ మాధ్యమానికి రాదు. మహాభారతాన్ని చదివినప్పుడు అది పాఠకుని మానస ప్రపంచంలో వికసించే తీరుముందు యెంత గొప్ప చలన చిత్రమైనా, మరేయితర ప్రదర్శన అయినా దిగదుడుపే అవుతుంది. ప్రపంచంలోని గొప్ప పుస్తకాలనంతా యిన్నిసార్లు నాటకాలుగా చలన చిత్రాలుగా, టీవీ సీరియళ్లుగా మలచినా వాటికున్న మహత్యం యే మాత్రం తగ్గకుండా నిలచి వుండడానికిదే కారణం.

నాశనం కానిదాన్ని 'అక్షరం' అనడం, 'తల్లీ నిన్నుదలంచి పుస్తకం చేతన్‌ బూనితిన్‌' అని పుస్తకాన్ని సమస్త విజ్ఞానాలకీ భూమికగా గుర్తించడానికీ వున్న గొప్ప సంప్రదాయ సత్యాన్నిప్పుడు గుర్తించాల్సిన తరుణం వచ్చింది. సాంకేతికంగా యెంత ప్రావీణ్యతను పొందినా, సినిమా టీవీల వంటి సాధనాలు పుస్తకానికి అనుయాయులేగానీ, ప్రత్యామ్నాయాలు కాలేవని యిప్పటికైనా గ్రహించాలి.

యిప్పుడు గూడా యింగ్లీషులో పాఠకుల సంఖ్య బాగానే వుంది. మనదేశంలో వుండే యే పుస్తకాల అంగడికెళ్లినా అక్కడ వుండే అన్ని భారతీయ భాషా పత్రికలకంటే యింగ్లీషు పత్రికలే యెక్కువగా కనిపిస్తాయి. అన్ని విమానాశ్రయాల్లోనూ యాత్రికులు వందల, వేల పుటలుండే లావుపాటి యింగ్లీషు పుస్తకాలను చదువుతూ కనిపిస్తారు. అయితే ఇంగ్లీషుతోబాటూ యితర భారతీయ భాషలన్నింటితోనూ పోల్చినప్పుడు తెలుగులోనే పాఠకులు బాగా తక్కువగా వుండడం గమనించాలి. దేశస్థాయి, రాష్ట్రస్థాయి పుస్తక ప్రదర్శనలు జరిగినప్పుడు అన్ని భాషల పుస్తకాల కంటే తెలుగులోనే తక్కువ పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం తెలుగు రాష్ట్రాల్లో విద్య మాతృభాషలో కాకుండా, యింగ్లీషులోనే జరగడం.

ప్రపంచ విజ్ఞానమంతా యింగ్లీషులోనే వుందనీ, ఆధునిక పోటీ ప్రపంచంలో నిలబడగలగాలంటే యింగ్లీషు మాధ్యమంలోనే విద్య వుండాలనీ ప్రభుత్వాధినేతలు నొక్కి చెబుతూంటారు. యింగ్లీషులో కాకుండా తమ మాతృభాషలోనే చదువుకునే చైనా దేశీయులు యీ పోటీలో ముందే వున్నారు. అమెరికాలో చదువుకునే చైనీయులు యింగ్లీషులో పాఠాలు అర్ధం చేసుకోకపోయినా, వాళ్ళ మాతృభాషలో వున్న పుస్తకాల్ని చదువుతూ యెవ్పటికవ్చుడు అగ్రశ్రేణిలోనే వున్నారనీ అక్కడి అధ్యాపకులు చెప్తారు. దానికి కారణం ప్రవంచంలో యెప్పటి కప్పుడు వస్తున్న విజ్ఞానాన్నంతా తమ మాతృభాషలోకి అనువదించి ప్రచురించుకునే సంస్థల్ని అక్కడి ప్రభుత్వాలు నిర్మించి, ప్రోత్సహించడమే! యిటువంటి అనువాద సంస్థల్ని గురించి యింతవరకూ మన ప్రభుత్వాలు ఆలోచించనైనా లేదు.

ప్రతి పాఠశాలలోనూ వొకప్పుడు గ్రంథాలయానికొక ప్రత్యేకమైన పీరియడ్‌ వుందేది. ఆ సమయంలో విద్యార్థులకు పుస్తకాలనిచ్చేవారు. కొన్ని పాఠశాలల్లో ప్రత్యేకమైన సాహిత్య సంఘాలుండేవి. వాళ్ళు క్రమం తప్పకుండా సాహిత్య సమావేశాలు జరిపేవాళ్ళు. కొన్ని మంచి పాఠశాలల్లో విద్యార్థులు తాము చదివిన పుస్తకాల గురించీ, తమకు నచ్చిన రచయితల గురించీ చర్చలు జరిపేవాళ్లు. పిల్లల్లో పఠనాసక్తిని పెంచే యిటువంటి కార్యక్రమాలకు యికనైనా పాఠశాలలు పూను కోవాలి.

చిన్నపిల్లల మేధాశక్తిని పెంచడానికి వుస్తకాలే ముఖ్యమైన దోహదాలు. తల్లిదండ్రులు చాలామంది తమ పిల్లలకు యింగ్లీషు సరిగ్గా రావడం లేదనీ, వ్యాకరణం నేర్పమనీ వుపాధ్యాయుల దగ్గర మొరపెట్టుకుంటూ వుంటారు. పిల్లలను పుస్తకాలు చదవనివ్వకపోవడం మొదటి తప్పయితే, మాతృభాషలోని పుస్తకాల్ని పట్టించుకోకపోవడం యింకో తప్పు. కాలక్షేపం పేరుతో టీవీ కార్యక్రమాలు కాలక్షేపాన్నే కలిగిస్తాయి. అయితే కాలక్షేపం పేరుతో దగ్గరయ్యే పుస్తకాలు మనిషిని చైతన్య వంతుడ్ని చేస్తాయి. మార్కుల కోసమే పరిగెత్తే నేటి విద్యార్థులు యాంత్రి కంగా మారడానికి పుస్తక పఠనం లేకపోవడమే కారణం. గత పాతికేళ్ళుగా అనేక రకాల పరీక్షల్లో అగ్రశ్రేణిలో వుత్తీర్ణులైన అనేక మంది విద్యార్థులు తరువాతి కాలంలో యెలా తయారయ్యారో పరిశీలిస్తే సమగ్రమైన ఎదుగుదల యెంత అవసరమో, దానికి పుస్తక వఠనమెంతగా వుపయోగ పడుతుందో అర్ధమవుతుంది.

అమెరికాలోని అనేక నగరాలకు వెళ్లినప్పుడూ, యితర దేశాలను చూసినప్పుడూ అక్కడ [గ్రంథాలయాలకున్న ప్రాముఖ్యత వెల్లడవుతుంది. ప్రతి నగరంలోనూ పెద్దదీ, అందమైనదీ అయిన భవనం గ్రంథాలయమే అయి వుంటుంది. దానిలో దాదాపుగా దొరకని పుస్తకాలుండవు. దొరకని పుస్తకాలను యితర గ్రంథాలయాల నుంచీ తీసుకొచ్చి పాఠకుల కిచ్చే సౌలభ్యం కూడా వుంటుంది. అక్కడి పుస్తకాల అంగళ్లు గూడా గ్రంథాలయాల్లాగే వుంటాయి. కొందరైతే అక్కడే కూర్చుని వుచితంగా పుస్తకాలు చదువుకుంటూ వుంటారు. కొన్ని పుస్తకాల అంగళ్ళు గొప్ప సాంస్కృతిక కేంద్రాలుగా గూడా వుంటాయి. అక్కడ అప్పుడప్పుడూ సాహిత్య సమావేశాలు గూడా జరుగుతాయి. 'రైటర్‌స్‌ కార్నర్‌' అనే ప్రత్యేక స్థలంలో రచయితల్ని కలుసుకునే వీలుగూడా వుంటుంది. రచయితలు సంతకం చేసిన పుస్తకాల కోసం పాఠకులు యెగబడుతూ వుంటారు.

యింత గొప్పగా గాకపోయినా నా చిన్నతనంలో అన్ని వూర్లలో వో మాదిరి గ్రంధాలయాలుండేవి. జిల్లా కేంద్ర నగరంలోని గ్రంథాలయం యెప్పుడూ పాఠకులతో వెలిగిపోతూ వుండేది. ఆ రోజుల్లో కొన్ని లిఖిత పత్రికలు గూడా వుండేవి. యే చిన్న వత్రికలో రచన వచ్చినా చదివి గుర్తుంచుకునే పాఠకులుండేవాళ్ళు. యిప్పుడు తెలుగు

తెలుగు ప్రాధికార సంస్థ ఏర్పాటుకై చట్టాన్ని వెంటనే తేవాలి

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018

25