ఈ పుట అచ్చుదిద్దబడ్డది
జూన్ 25న పెద్ద బొంకూర్ శాతవాహన స్థావరంలో ఊరేగింపు తీసి, ఈ స్థలాన్ని కాపాడాలని కోరిన చరిత్రకారులు, రచయితలు. డా॥ మలయశ్రీ, డా॥కాలువ మల్లయ్య, అల్లం వీరయ్య, బాలసాని రాజయ్య, మార్వాడి సుదర్శన్ తదితరులు ఉన్నారు.

చరిత్రకారులు ఠాకూర్ రాజారాం సింగ్ పెద్దపల్లి ప్రాంతంలోని యితర శాతవాహన స్థావరాలైన ధూళికట్ట పెద్ద బొంకూర్‌లను వెలుగులోకి తెచ్చారు. ధూళికట్టలో క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్తూపం బయటపడింది. ఈ స్తూపం అమరావతికన్న వంద ఏళ్లకు పూర్వమైనదని అంచనా వేశారు. దీనికి పది కిలోమీటర్ల దూరంలో వున్న పెద్దబొంకూర్లో శాతవాహనుల గ్రామీణ స్థావరం బయటపడింది. తెలంగాణా ప్రాచీన చరిత్రకు ఉమ్మడిరాష్ట్రంలో సరైన న్యాయం జరుగలేదు. పెద్దబొంకూర్‌లో శాతవాహన స్థావరంలో 70 ఎకరాల భూమిని గుర్తించి, సేకరించారు. కోటిలింగాల ధూళికట్ట మొదలగు శాతవాహన స్థావరాలతో సమానంగా పెద్దబొంకూర్ శాతవాహన స్థావరం కూడా ముఖ్యమైనదని తెలంగాణా రాష్ట్ర పురావస్తుశాఖ గుర్తించింది. 1968 నుండి 1974 వరకు ఉమ్మడి రాష్ట్ర పురావస్తుశాఖ ఇక్కడ పాక్షికంగా తవ్వకాలను నిర్వహించింది.

హుస్సేమియా వాగు తీరంలో వున్న, ఈ స్థావరంలో ఒక రైతుకు పొలంలో శాతవాహనుల కాలంనాటి నాణెముల కుండ దొరికింది. ఈ కొండలో 22 వేలకు పైగా నాణాలువున్నాయి. 1968 - 74 మధ్య యిక్కడ తొలిసారిగా జరిపిన తవ్వకాలలో శాతవాహనుల కాలంనాటి మూడు ఇటుక కట్టడాలు, ఇటుకతో కట్టిన 22 చేదబావులు, మట్టి గాజులతో నిర్మించిన ఒక బావి బయటపడింది. రెండు టంకశాలలు, మురుగు కాలువల ఆనవాళ్ళు, బయటపడ్డాయి. శాతవాహనులు, మౌర్యులు రోమన్ చక్రవర్తుల కాలమునకు చెందిన రాగి నాణెములు, సీసపు నాణెములు, పంచ్ మార్క్ నాణెములు దొరికాయి. ఆ కాలములో వాడుకలోకి ఉపయోగించిన లోహపు పనిముట్లు ,అబ్బురపరిచే రీతిలో మట్టి బొమ్మలు, అచ్చు ముద్రికలు, రాతిపూసలు లభించాయి. ఇవన్నీ క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుండి మొదలుకొని క్రీస్తుశకం 2 వ శతాబ్దమునకు చెందినవిగా గుర్తించారు.

ధూళికట్ట బౌద్ధస్తూపం వద్ద 1972 - 75 లో జరిగిన పురావస్తు తవ్వకాలలో శాతకర్ణి కుమారుడు పులుమావి వేయించిన వెంది నాణెం బయటపడింది. రోమన్ రాజుల నాణాలు ఇక్కడ దొరకడంతో శాతవాహనులకు సముద్ర వ్యాపారాలు బాగా ఉండేవని తెలుస్తున్నది. గోదావరి నదిలో పడవలు బంగాళాఖాతం సముద్రం వరకు నడిపి, విదేశాలతో సముద్ర వ్యాపారం చేసే వారిని తెలుస్తున్నది.

కోటిలింగాల తవ్వకాలలో శాతవాహనుల పూర్వ రాజులైన గోబద, నారన, కంవాయసిరి, సమగోప మొదలైన రాజుల నాణాలు కూడ దొరికాయి మహాతలవర, మహాసేనాపతి, శబక వంటి సామంత రాజులకు చెందిన నాణాలు కూడా యిక్కడి తవ్వకాలలో బయటపడ్డాయి ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుండి వేరుపడి, తెలంగాణా వచ్చాక 2015 - 2017 సంవత్సరాల మధ్య సిద్ధిపేట సమీపంలోని పుల్లూరుగ్రామంలో జరిపిన తవ్వకాలలో బృహత్ శిలాయుగపు సమాధులలో మానవ అవశేషాలు బయటపడ్డాయి నర్మెట్ట గ్రామంలో కూడా సమాధిపై పేర్చిన బండ మూతరాయి బయటపడింది. పాలమాకుల గ్రామంలో కూడా ఇలాంటి బృహత్ శిలా సమాధులే బయటపడ్డాయి. గోదావరి తీరంలోని కోటిలింగాల ఆవలవైపు వున్న మంచిర్యాల జిల్లాలోని కర్ణమామిడిలో 2017 లో తెలంగాణా పురావస్తుశాఖ వారు, పాక్షికంగా తవ్వకాలను నిర్వహించారు. వర్షాకాలం రావడం వల్ల నెలరోజులకు పైగా జరిపిన ఈ తవ్వకాలను అర్ధాంతరంగా నిలిపివేసినట్టు సమాచారం .

పెద్దబొంకూర్ శాతవాహన స్థావరంలో 48 యేంద్ల కింద నిలిపి వేసిన తవ్వకాలను, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత, కొనసాగించడానికి తెలంగాణా పురావస్తు శాఖ అధికారులు ముందుకు రావడం పట్ల, తెలంగాణా చరిత్రకారులు తమ హర్షామోదాలను వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని ఆర్కియాలజజి శాఖ సుమారు 22 లక్షలతో ఒక్క తెలంగాణాలోని పెద్దబొంకూర్లోనే, ఒక్కచోటనే తవ్వకాలు చేపట్టడానికి అనుమతి మంజూరు చేయడం గమనించాలి.

ఫిబ్రవరి 22న పెద్దబొంకూర్లో పురావస్తు తవ్వకాలకు, తెలంగాణా

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జూలై 2018

17