ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సోదరుడు స్టార్టన్‌ యింట్లో అతిథులుగా వుండి, తర్వాత ఊరికి కాస్త దూరంలో వున్న సెయింట్‌ థోమ్‌ (శాంథోమ్‌) ప్రాంతానికి కాపురం మార్చారు. సెయింట్‌ థోమ్‌ సముద్రానికి మరింత దగ్గరగా వుండటంవల్ల చల్లగా వుందని, 92 డిగ్రీల వుష్ణోగ్రత వున్న ప్రాంతం నుంచి 82 డిగ్రీలున్న ప్రాంతానికి మారడం బాగానే వుందని 'ఆమె” ఆగస్టు 16వ తేది (?) రాసిన జాబులో పేర్కొంటుంది. కానీ ఇది కూడా ఆమెకు సరిపడిన ప్రాంతంకాదు.

పదవ లేఖ

“రాజమండ్రిలో తెలుగు లేదా “జెంటూ” మాట్లాడుతారు. అది తమిళంకంటే మనోహరమైన భాష.”

ఎ- కి రాజమండ్రి జిల్లా జడ్జి ఉద్యోగం అయింది. ఈ మార్పుకి “ఆమె” చాలా సంతోషిస్తుంది. రాజమండ్రి మంచి ప్రదేశమని, రెండు నెలలు వాతావరణం చల్లగా, హాయిగా ఉంటుంది, అప్పుడు ధరించేందుకు ఉన్నిదుస్తులు వుండాలని మిత్రులు చెప్పారు. ఎ - ఆ దేశంలో పనిచేయటం ఇది తొలిసారి. “రాజమండ్రిలో అన్నీ చవకే కానీ మాంసం, బ్రెడ్‌, కూరగాయలు తప్ప మరేవీ దొరకవు. కూరగాయలు కూడా మాకు మద్రాసు నుంచి విత్తనాలు తీసుకెళ్ళి నాటుకోవాల్సిందే! ఆరు నెలలకు సరిపడా సరుకులు వెంట తీసుకెళ్ళాలి. ఫర్నిచరు, దుస్తులు సరేసరి, అనేక వస్తువులు తీసుకెళ్లాలి, ఏదైనా మరచిపోయామా, మళ్లీ మద్రాసు నుంచి తెప్పించుకొనేదాకా గతిలేద "ని ఆమె జులై 10వ తేది మద్రాసు నుంచి రాసిన జాబులో అంటుంది. రాజమండ్రిలో యూరోపియన్లు ఎక్కువగా లేకపోవడం వల్ల ఒంటరితనం తప్పదు. చిన్న చర్చి అయినా లేదు, మిషనరీలు కూడా లేరు. ఐనా అసలైన భారతీయత ఉట్టిపడే భారతీయ ప్రాంతానికి వెళ్తున్నందుకు ఆమె ఎంతగానో సంతోషిస్తుంది.

అప్పటికి ఆమె పచ్చిబాలింత. “కాసేపయినా కూర్చొనే శక్తి లేదు. పాప ముద్దుగా బొద్దుగా వుంది. కాన్సు ఇంగ్లండులో అయివుంటే పాప ఎంత ఆరోగ్యంగా వుండేదో!” అని రాస్తుంది. నెలల బిడ్డను ఎత్తుకొని దూర ప్రాంతం ప్రయాణించాలి. రోడ్డు మీదనా, సముద్రం మీదనా! రోడ్డుమీదైతే దేశంచూడవచ్చునని (ఆమె ఆ స్టితిలో కూడా) కుతూహల పడుతుందికానీ, చాలా శ్రమ, పైగా కలరా ఎక్కువగా వుండడంవల్ల ప్రమాదం అనుకొని, చివరికు సముద్రయానానికి నిర్ణయించి, జులై 29, శనివారం రాత్రి నెలల బిడ్డతో, సిబ్బందీ సరంజామాతో మద్రాసులో నౌక యెక్కారు. ఒక నౌకలో 'ఆమె ఎ-, సిబ్బంది, మరో నావ నిందుకు సామాన్లతో ప్రయాణం మొదలయింది. శనివారం రాత్రి బయల్దేరాల్సిన నౌక, ఏవో లోపాలు, అవరోధాలవల్ల 18 గంటలు ఆలస్యంగా ఆదివారం మధ్యాహ్నం దాకా తీరం వదల్లేదు. అప్పటి దాకా అందరూ నౌకలో పడిగాపులు కాశారు.

మొత్తం మీద ప్రయాణం సజావుగా సాగింది కానీ, ఆదివారం రాత్రి ఉన్నట్లుండి తుపాను ముట్టడించటంతో కాస్త విసుగని పెంచింది. బయట పెనుగాలి, ఉరుములు, మెరుపులతో సముద్రం సూరెత్తుతుంటే, లోపల కొందరు రోమన్‌ కాథలిక్కులు గిటార్‌ సంగీతంతో ప్రయాణీకుల చెవులు సూరెత్తించారు. “రెండు శబ్ధాలూ జతగలిసి దుర్భరంగా వినవస్తుంటే, అంత విసుగులోను నాకు నవ్వు వచ్చిందని ఆమె రాస్తుంది. వాళ్లు కోరింగలో దిగి రాజమండ్రి

| తెలుగుజాతి పత్రిక అవ్మునుడి ఆ ఇలై-2020 |

వెళ్లాలి, కానీ కెప్టెన్‌ తెలివితక్కువ వల్ల నౌక మంగళవారం ఉదయం కోరింగ దాటి విశాఖపట్టణం దారి పట్టింది. ఆ సంగతి తెలుసుకొనే సరికి దాదావు సగం దూరం వెళ్ళిపోయింది.

నౌక మంగళవారం రాత్రి విశాఖపట్టణం తీరం చేరేసరికి, అక్కడ అసిస్టెంట్‌ జడ్జి మిస్టర్‌-ఆర్‌ ఎ-కుటుంబాన్ని తన యింటికి రమ్మంటూ ఆహ్వానం పంపాడు. ఆయనకు కొండ మీద చిన్న బంగళా వుంది. వాళ్లక్కడ బుధవారం గడిపి బుధవారం రాత్రి పల్లకీల్లో రాజమండ్రి బయల్దేరారు. “నాతో పసిపాప, ఆయాలు, నౌకర్లు కాస్త వెనకాముందుగా సామాన్లను బళ్లకెక్కించారు. పల్లకీల మోతకు, వంటసామాగ్రి, గుడ్డలు వగైరా తేవడానికి 52 మంది మనుషులు కావలసివచ్చారు. రాత్రిళ్లు ప్రయాణం, పగలు రహదారి బంగళాల్లో విశ్రాంతి. వంటకీ, వార్పుకీ ఓ ముసలి సిపాయి వుండేవాడు.

ప్రయాణం సరదాగానే గడఛి, శనివారం రాత్రి రాజమండ్రి, చేరుకొన్నారు. ఈ ప్రయాణాన్ని వర్ణిస్తూ ఆమె “చాలా ప్రదేశాలు చూశాం, పులులు తిరిగే అడవుల్లో ప్రయాణించాం. కానీ పులులు మాత్రం కనబడలేదు. వాటికి దీపాలన్నాా మనుషుల అలికిడన్నా భయమట. (ఎన్‌.బి. - అడవంటే చిక్కటి ఫొదలు, అక్కడక్కడా చెట్టూ చేమా వుండే బంజరు ప్రాంతం, అందులో పులులు, చిరుతలు, నక్కలు, కోతులు, పాములు, అందమైన పక్షులు వుంటాయి.)

రాజమండ్రి గోదావరి వొడ్డున వుంది. దూరాన కొండలు. చాలా అందమైన ప్రదేశం.. మా పల్లకీ రాజమండ్రి చేరేసరికి నేను గాఢ నిద్రలో వున్నాను, భయంకరమైన అరుపులకు నిద్ర మేల్కొన్నాను. “రాజమండ్రిలో కలరా ముమ్మరంగా వుంది” దాన్ని తరమగొట్టడానికి ప్రజలు గుంపులు గుంపులుగా చేరి రాత్రంతా డప్పులు వాయిస్తున్నారు. దాంతో వాళ్లు మరింత బలహీనపడి కలరా బారిని పడుతున్నారు అంటుంది. ఇరవై రోజుల క్రితం ఇక్కడ దాదాపు లక్ష మంది చేరారు. సరైన తిండి, సౌకర్యాలు లేక చాలామంది కలరా బారినపడ్డారు. ఎ - కలుసుకున్న అధికారి అడవిలో రోడ్డు వేయడంలో శ్రద్ధకనబరిచాడే తప్ప ఈ కోణం గురించి పట్టించుకోలేదు. (పుష్మరం సందర్భంగా - అనువాదకుడు)

ఎ - రాజమండ్రి రాగానే వీధులు శుభ్రం చేయించడానికి ఖైదీలను పురమాయించాడు. యూరోపియన్లకు ప్రయాణాల్లో తప్ప, కలరా భయం లేదు. ఐనా, ఆమె తన పనివాళ్ల కోసం ఇంట్లో ఎప్పుడూ కలరా మందులు సిద్ధంగా వుంచేది. వాళ్ళకు శుభ్రమైన ఆహారం, నివాసం ఏర్పాటు చేసింది కనుక సాధారణంగా ఆ వ్యాధి సోకదని ఆమె అంటుంది.

_ తరువాయి వచ్చే సంచికలో


“అమ్మా! నీ భాష కావాలి
నిప్పులు చెరగటానికి
చెమటను జల్లెడపట్టి
సంపదలను తీయటానికి

{తెలుగు పౌరుషాగ్ని రాజెయ్యడానికి

మాతృభాష కావాలి
:-ఛాయరాజ్‌ (మాతృభాష- కవిత)

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * జులై-2020

49