ఈ పుటను అచ్చుదిద్దలేదు

భౌగోళిక రాజకీయ అంశాలన్నీ సహకారణాలు లేదా పరిస్థితులు (ప్రత్యయాలు) గా నిలుస్తాయి.

ఏ కార్వానికైనా ఒకే కారణమంటూ ఉండదు. హేతుప్రత్యయాలు కలగలసిన '“పరస్పరాధారిత ఆవిర్భావం” గానే కరోనా వంటి మహమ్మారులు ఉనికిలోకి వస్తున్నాయని గ్రహించాలి. ఈ రోగ కారక క్రిములు చేస్తున్న మారణహోమానికి తాత్మాలిక పరిష్కారాలుగా మందులు, వాక్సిన్‌ల వంటివి కనుగొన్నప్పటికీ, దీర్హకాలిక, శాశ్వత పరిష్కారం కోసం ప్రపంచ ఆభివృద్ధి నమూనాను సమూలంగా పునర్నిర్వచించుకోక తప్పదు.

మానవజాతినీ వణికించిన వైరస్‌ల కోవలోనీదే ఈ కరోనా వైరస్‌. అయినప్పటికీ, దీని తీవత వాటన్నిటినీ మించి అంతర్జాతీయ సమాజాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనా వైరస్‌ పైకి ఒక వ్యాధిగా కనపడుతున్నా ప్రకృతితో మనుషులు వ్యవహరిస్తున్న విధానానికి పర్యవసానం అది. ఈ క్రమంలో కొత్త కొత్త క్రిములతో వేధిస్తున్న జబ్బులకు వెనుక ఏవో కుట్రలున్నాయన్న అనుమానాలు కరోనా భయాలతో పాటు మీడియా, సామాజిక మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇలాంటి మహమ్మారుల విజ్బంభణ వెనుక అసలు కారణాలేమిటో పట్టుకునే దాకా ఇటువంటి అంటు రోగాలు మళ్ళీ మళ్ళీ ప్రబలుతూ మారణ హోమాన్ని సృష్టిస్తూనే ఉంటాయి. ఇలాంటి ప్రాణాంతక వైరస్‌లు అంటకుండా వాక్సిన్‌లు, నయమయ్యేందుకు మందులు కనీపెట్టినప్పటికీ అందుకు కారణమైన పర్యావరణ విధ్వంసక సామాజిక ఆర్థిక విధానాలను విడనాదనంత వరకు కొత్త కొత్త రోగాలు మానవాళిపై దాడి చేస్తూనే ఉంటాయి. అయితే కొత్త వైరన్‌ రూవంలో దాడి చేసే ఈ రోగాలకు రెండు మూల కారణాలున్నాయి. ఒకటి భౌగోళిక అధిపత్యం కోసం పోటీ పదుతున్న అమెరిక్కాయూరోపియన్‌ యూనియన్‌ దేశాలు, చైనా, రష్యా వంటి సామ్రాజ్యవాద దేశాల మధ్య సాగుతున్న అర్థిక, రాజకీయ పోరులో భాగంగా తయారు చేస్తున్న జీవ-రసాయన అయుధాలు; రెందు- పర్యావరణ విధ్వంసక వ్యవసాయ, పారిశ్రామిక విధానాల కారణంగా జీవజాలంలోని రోగ కారక [క్రిముల (వైరన్‌, బ్యాక్టీరియా)లో మ్యూటేషన్స్‌ (ఉత్పరివర్తనలు) సంభవించి సరికొత్త ప్రాణాంతక రోగాలుగా అవతరించడం.

సంపద సమీకరణలో భాగంగా ఆధిపత్య శక్తుల విధానాల మూలంగా మానవ ఆవాసాలు, కార్యకలాపాలు ప్రకృతిలో ఇతర జీవజాల క్రమాలలోకి చౌారబడే కొద్దీ మానవాళి మొత్తంగా కొత్త కొత్త జీవ సంబంధిత సమస్యల్ని రోగ కారక [క్రిముల రూపంలో ఎదుర్మొనవలసి వస్తుంది. ప్రకృతి నియమాలకు లోబడి దాని వనరుల వినియోగం ఉంటేనే మహమ్మారులు, విలయాల రూపంలో విపత్తులు రాకుండా ఉంటాయి. (ప్రకృతిని నియమాలకు లోబడి వమన అవసరాలను తీర్చుకునే విధానాన్ని చేపట్టడంలోనే మానవ మనుగడ ఉంది. అంతేగానీ దానిలోని నిర్జీవ, జీవ క్రమాలకు భిన్నంగా అత్యాశతో భూసార (వ్యవసాయ, పారిశ్రామిక ముడి సరుకులు) దోపిడి చేస్తే భూగోళంపై గల జీవ, నిర్జీవ 'శ్రమాల మథ్యనున్న సారూప్యత దెబ్బతినడంతో తలెత్తే విపత్తులు, వైపరీత్యాలు, మహమ్మారుల రూపంలో ప్రకృతి మనపై పగతీర్చుకుంటుంది. విచక్షణారహితంగా పర్యావరణ విధ్వంసం చేస్తూ, పిడికెడు మందికి సంపదల సమకూర్చిపెట్టే అర్థిక విధానాలే వైపరీత్యాల, విశ్వమారిల మారణ పోమాలకు ప్రధాన కారణంగా గుర్తించనంత వరకు ఇవి

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ జులై-2020 |

పునరావృతమవుతూనే ఉంటాయి.

“నివాస స్థలాల విధ్వంసం, భూ వినియోగంలో అనుసరిస్తున్న అశాప్రీయ పద్ధతులే వైరస్‌లు మానవులకు సోకడానికి దారితీస్తున్నాయి. ప్రస్తుత కరోనా విపత్తు అడ్డూ అదుపులేని పెట్టుబడిదారీ విధాన ఆత్మ వినాశక ధోరణులను బహిర్గతం చేసింది. 2003 సార్స్‌ అంటువ్యాధి సందర్భంలో, మరో కరోనా వైరస్‌ విశ్వమారి ప్రబలుతు న్నదనీ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆ మహమ్మారి నెదుర్మొనేందుకు మనం సంసిద్దమవ్వాలని కూదా వారు విజ్ఞప్తి చేశారు. అయితే ఆ మోచ్చరిక విన్నదెవరు? పట్టించు కున్నదెవరు? అపరిమిత సంపద్వంతమైన జెషధ కంపెనీలు అందుకు పూనుకోవాలి. అయితే పెట్టుబడిదారీ విధాన తర్మం అందుకు అవరోథమైైంది. లాభాలు ఉండవు గనుక అవి ఆ కర్తవ్యంపై దృష్టి పెట్టలేదు. పెట్టవు కూడా. ఆ బాధ్యతను నీర్వర్తించాల్సిన (ప్రభుత్వాలు నయా ఉదారవాద ప్రభావంలో ఉన్నాయి.... ఇప్పుడు మనలను అతలాకుతలం చేస్తోన్న సంక్షోభం నుంచి పాఠాలు నేర్చుకోకపోతే పర్యవసానాలు మరింత తీవ్రంగా ఉంటాయి. ఇందులో ఎలాంటి సందేహంలేదూ అని సుప్రసిద్ధుడైన మేధావి నోమ్‌ చామ్‌స్కీ్‌ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన అభిప్రాయం మానవత్వ సంక్షోభ తీవ్రతను, తీరును తెలియజేస్తోంది. భౌగోళిక రాజకీయార్థిక సంక్షోభ ఫలితం:

కరోనా విశ్వమారి మానవాళి పై విరుచుకుపడదానికి భౌగోళిక రాజకీయాలే (ప్రధాన కారణమా?! 2007లో గృహ రుణాల సంక్షోభంతో (ప్రారంభమై తాను ఆర్థిక మాంద్యంలోకి పీకల్లోతు కూరుకుపోయిన అమెరికా... సార్వత్రిక సంక్షోభంలో కొనసాగుతున్న ప్రవంచార్థిక వ్యవస్థను మరింత విధ్వంసకర స్థాయికి తీసుకుపోయింది. యూరోపియన్‌ యూసీయన్‌ పెట్టుబడిదన్నుతో అమెరికా ప్రపంచాధిపత్వానికి గండికొట్టిన సాామాజ్యవాద చైనా సారథ్యంలోని కూటమికి మధ్య సాగుతున్న భౌగోళిక ఆధిపత్య పోటీ ఆర్థిక, సైనిక రంగాల్లో వెరితలలు వేసింది. సంప్రదాయిక ఆయుధాల స్థానంలో క్రిమి ఆయుధాలను తయారు చేయడం, ఇతర జీవజాలాల నీవాసాల్లోకి చొారబడడం, జన్యు పరిశోధనలతో అధిక ఫలసాయం, అధిక మాంసోత్పత్తులను సాధించేందుకు చేస్తున్న విధ్వంసకర ప్రయోగాలు ఫలితంగా కరోనా తరహా క్రిములు దశాబ్దాలుగా వరుసగా ఉనీకిలోకి వస్తూ మానవ మనుగడను (ప్రశ్నార్ణకంగా మారుస్తున్నాయి, భవిష్యత్‌లో మరిన్ని మహమ్మారులూ వస్తాయి. వైనాలోని వూహాన్‌ పారిశ్రామిక కేంద్రంలోని మాంసోత్పత్తుల (వివిధ జంతువులు, జలచరాలు) మార్కెట్‌ లేదా అమెరికాను దెబ్బ తీయాలనే వ్యూహంతో చైనా రూఫొందిన్తున్న జీవాయుథ పరిశోధనల నుంచి కరోనా విశ్వమారి విజ్బంభఖించిందనీ అమెరికా తదితర పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి.