ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఇంటింటా వెలిసినాయి. అప్పుడు తమిళనాడు ప్రభుత్వం, రూపాయి తాంబై పైసలకే కిలో బియ్యం ఇస్తా ఉంది. “అన్న పాలన వస్తే కిలోకు పదిపైసాలు జాస్తి అయితుందంటమ్మో" అనీ ఎవరైనా ఆడవాళ్లతో అంటే 'పది పైసాలు కాదు ఏబై పైసాలు కానీ, అన్న వస్తే అదే చాలు” అనేస్తా ఉందారు.

అభిమాన సంఘాలలోనీ చానామంది యువకులు, తెలుగు కార్యకర్తలుగా, అనెంక నాయకులుగా ఎదిగిరి. ఆంధ్ర సాంస్కృతిక సంథాలవారు శీకృష్ణదేవరాయలు జయంతినీ ఏటేటా చేసేకి ఆరంఖించిరి. బోసుబజారు మిత్రబ్బందంవారు ఉగాది వేడుకల్ని ఘంటసాల పాటలపోటీని నదపతా ఉందారు. జనప పేట, గొల్లపేట, నేసేపేటల్లో ఉగాది వేడుకలు సురువయినాయి. ఎన్టీఆర్‌ కళాపీఠం సామాజిక సేవా కార్యక్రమాలను ఆరంభించింది. తెలుగు సాహిత్య పరిషత్‌ కార్యకలాపాలు 'పప్రారంభమయినాయి. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ అభిమాన సంఘాలూ, వాటికి కొనసాగింపుగా చిరంజీవి, బాలకృష్ణ అభిమాన సంఘాలూ [గ్రామగ్రామాన ఏర్పాటయినాయి. తెలుగువాళ్లే ఎమ్మెల్లేలుగా ఎన్నికయితా ఉందారు. యువకులంతా కలిసి పెద్దల, రాజకీయనాయకుల అందదండతో గొడవలకు దిగి బస్టాండులో బస్సుల మీదా తెలుగు అక్షరాలను రాయించిరి. తెలుగు భాషోద్యమ సమాఖ్య శాఖ ఏర్పడి ముప్పైకి పైచిలుకు ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు బోర్టులను పెట్టించింది. శాసనసభ్యుడి అండదండతో బిడ్డలను తెలుగుబడిలో చేర్చందడనీ వల్లెవల్లెనా “తెలుగు దండోరా” సురువయింది. “నడుస్తున్న చరిత్ర అనే నెలపత్రీక మాతావుకు వచ్చి, హోసూరు తెలుగును బయటి ప్రపంచానికి చాటి చెప్పింది. కృష్ణగిరి జిల్లా రచయితల సంవుం (కృష్ణరనం) ఏర్పడి ఎంతోమంది రచయితలను తయారు చేసింది. బస్తీ యువకబ్బందం వారు ఉగాది వేడుకలను పెద్దయెత్తున మొదలుపెట్టేసిరి. “తేట తేట తెలుగులా.....” “తెలుగువీర లేవరా......” పాటలు మ్రైకుల్లో వోరెత్తిస్తుంటే తమిళులు దిగులు పడిరి. 'తెలుగుజాతి మనది, నీందుగ వెలుగుజుతి మనది” పాటలో 'తెలంగాణా నాది, రాయలసీమ నాది, నర్మారునాది, నెల్లూరునాది అనీ ఉంటే నెల్లూరుకు బదులుగా “హోసూరు'ను చేర్చి పాడుకుంటూ ఉండారు జనం.

ఆ తెలుగు వెలుగు ఇరవై ఏండ్లకు పైగా కొనసాగింది. హోసూరు తావున ఆ కాలంలోనే రెందు పెను విషాదాలను కూదా చవిచూసితిమి. 1) అందరమూ చేతలుడిగి ఉండిపోయినపుడు, ఒంటరిగా అరవ దొరతనాన్ని ఎదిరించి, బతికినంతకాలమూ హోసూరును ఆంధ్రలో కలపాలని తపనపడిన కోదండరామయ్యగారు, 1984లో కనుముఠరు గయిపోయిరి. 2) ఏ పేరును తలచుకొని రొమ్ము విరుచుకొని నడచి తిమో, ఏ పేరును చెప్పుకొని తలెత్తుకొని నీలబడితిమో, ఆ ఎన్టీరామారావుగారు కనుమూసిరి.

ఈ కతకు సంతోషపు ముగింపును ఇయ్యాలనే ఉందినాకు. కానీ ఇది కతకాదు, ఒక తావు బతుకు కదా!

ఇరవైయేంద్లకు పైగా సాగిన ఆ వెలుతురుపైకి మెల్లగా చీకటి కమ్ముకొనీంది. అదే కద్ద్టాయ (తప్పనిసరి) తమిళ్‌ చట్టం. దీనినీ తెచ్చింది డి.ఎం.కె. ప్రభుత్వం. తమిళునాడులో ఉందేవాళ్లంతా తమిళ ను ఒక పాఠంగా బడిలో తప్పనిసరిగా చదవాలనే చట్టం అది. ఈ చట్టంలో తప్పేముంది అని అనిపిస్తుంది ఎవరికైనా. పైకి అట్లే

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ జులై-2020 |


ఉంటుంది కానీ లోపలుంది అసలు లొసుగంతా. ఆం(ధ్ర, కర్నాటక, కేరళ వంటి రాష్ట్రాలలో త్రిభాషా సూత్రం ప్రకారం చదువు ఉంటుంది. తమిళనాడులో ద్విభాషాసూత్రం. ఇన్నాళ్లూ తెలుగు, ఆంగ్లం, రెండు భాషలు: లెక్కలు సామాన్య సాంఘికలు తెలుగులో ఉందె. కొత్త చట్టంలో తమిళు, ఆంగ్లం తప్పనిసరి. ఇతర భాషలవారు కావాలంటే వాళ్లభాషను ఒక పాఠంగా చదువుకోవచ్చు. అయితే దానికి పరీక్ష మార్కులు, సర్టిఫికేట్‌ లో చూపదడము ఉండదు. అంటే పేరుకు తెలుగు ఉంటుంది కాన్సీ, నేర్పే దిక్కుందదు.

ఉత్తరువు వస్తానే హోసూరు తావున కలకలం శేగింది. కొందరు కోర్టుకుపోతే, కొందరు ప్రభుత్వానికి విన్నపాలు పంపుతుంటే, ఎమ్మెల్లే చట్టసభలో నోరుకొట్టుకొంటే అప్పుడు ప్రభుత్వం స్పందించి మైనారిటీ భాషల జోలికి రాము అనీ ప్రకటించింది. అమ్మయ్య అని ఊపిరిపీల్చుకొంటిమి. డి.ఎం.కె. ప్రభుత్వం పోయి అన్నా డి.ఎం.కె. ప్రభుత్వం వచ్చింది. తెలుగుబడులు మామూలుగానే నదస్తా ఉండాయి. కడ్డాయ తమిళ చట్టం వెలువడి పదో ఏడాది, పరోతరగతి పరీక్షలు ఇంకొక నెలనాళ్లలో ఉండాయనంగ్నా తెలుగు బదులంతా ఒక ప్రకటన వచ్చింది. చిన్నోళ్లు పరీక్షలన్నీ తమిళంలోనే రాయాలనే ప్రకటన అది. తలమీద గుందుపడినట్లయింది. తమిళ అక్షరమే తెలియని వేలాదిమంది విద్యార్థులు అన్ని సబ్జక్టుల్ని తమిళ్లో ఎట్ల రాసేది?

కొందరు కోర్టులకు పరుగులు తీసిర, హోసూరు వీధుల్లో జోరువానలో కూడా వేలాది జనం నీరసన తెలిపిరి, విద్యార్దులు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెత్తినాయి. బిజ్ణల భవిష్యత్తు చీకటయిపోయింది. న్యాయస్థానంలో రవంత ఊపిరి దారికింది. మూడు నాలుగేళ్ల వరకూ తెలుగులో రాయవచ్చు అనీరి. ఈ లోగా తమిళ ప్రభుత్వం, సర్మారుబడుల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. అరవం కంటే ఆంగ్లం మేలనీ మా తావునుండే తెలుగు బడులన్నీ మారిపోయె. ఇప్పుడు ఇక్కడ ఒక్క బడిలో కూడా తెలుగు అమ్మా ఆవూ లేవు. ఆంగ్ల మాధ్యమంలో అరవం ఒక పాఠం, అంతే.

సొతంత్రానికి ముందు తెల్లదొరల ఏలుబడిలో, జగిలి (అరుగు) బడుల్లో ఓనమాలతో ఊరూరా ఆరంభమైన తెలుగు చదువులు, 2006తో ముగిసిపోయినాయి. అన్నీ ఊళ్తల్లోనూ తెలుగు పేరెత్తితే చాలు, ఖీతి, భయం, దిగులుతో ఉలిక్కిపడతుందారు. అన్ని సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు దాదాపుగా నిలిచిపోయినాయి. చీకటి వెలుగుల మా తెలుగుబతుకుల్లో మరలా పొద్దుపొడిచేది ఎప్పుడో!

(పూర్తి అయింది)

“జోధనా మాథ్వమంగా మాత్సభాష ఉండాలనేది నా ఖబ్బితమైన అభివప్రాయం. విద్వావ్వాన్తికి పర్యశమంచడదమే విద్వాలయాల కర్తవ్యం. విద్వాలయాల్లో బోధనా మాధ్వమంగా

మాతృభాషను న్వీకరిస్తే తప్పు ఈ లక్ష్యం నెరవేరదు. ” - డా॥ బాబాసాహెబ్‌ అంబేద్మర్‌