ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాష్ట్రంలో చేరిపోవాలనీి మనమెంత పోరాడినా, కలవక మదరాసు రాష్ట్రంలోనే ఉండిపోయింది. 1965లో సేలం జిల్లా ఉత్తరభాగాన్ని చీల్చి ధర్మపురి జిల్లాగా చేసినపుడు, మన హోసూరు కూడా ఈ జిల్లా కిందకు వచ్చింది. మన ప్రాంతంలో ఇప్పటికీ 450 కి పైగా తెలుగు పాఠశాలలు నడుస్తున్నాయి. తమిళు స్మూళ్లు ఇరవైకూడా లేవు. 80శాతం పంచాయితీలలో తెలుగే రాతభాషగా ఉంది. న్యాయస్థానం లోగానీ సజ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కానీ తెలుగే రాత భాష తెల్ల దొరల కాలంలో కానీ కాంగస్‌ పాలన కాలంలో కానీ తెలుగు భాష జోలికి ఎవరూ రాలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం తెలుగును ఇక్కట్లు పెట్టాలనుకొన్నా అయ్యేది లేదు. మనమందరం కలిసి కట్టుగా ఉండాల. మన ప్రజాప్రతినీధుల తోడు మనకు ఉంది. ఎవరూ దిగులు పడాల్సిన పనిలేదు.”

మేస్టరు మాటల్ని విని అందరికీ రవంత థైర్యం వచ్చె. అందరమూ గట్టిగా చేతులు తట్టి వెనక్కు తిరిగితిమి. ఆ ధైర్యం సడలిపోయే దినము దగ్గర్లోనే ఉందని అప్పుడు మాకు తెలియలేదు. వెంటవెంటనే తెలుగుమీద తెలుగువాళ్లమీద దెబ్బమీద దెబ్బ పడింది. స్కూల్లో తమిళ ప్రార్దనే జరగాలని నీర్బంధం పెరిగింది. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో, ఆంధ్ర సారస్వత సంఘంవారు, ఆరుద్ర, కొంగర జగ్గయ్యగార్లను పిలిపించి సాహిత్య సభను ఏర్పాటుచేస్తే, తమిళ పోలీసుల అండతో రౌడీ మూకలు, సభావేదిక తాళ్లను కత్తిరించేసిరి. వేదికమీది కొందరికి గట్టి దెబ్బలు తగిలినాయి. మరొకసారి గుమ్మడి, సినారె గార్లను పిలిపించుకొనే దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తెలుగు సినిమాల ప్రదర్శనకు కూడా ఆటంకాలు మొవలయినాయి. తమిళ చిత్రాల్నే వేయాలని తియేటర్ల యజమానులకు బెదిరింపులు పోసాగినాయి. దెంకణికోటలో ఏర్పాటుచేసిన నరాల రామారెడ్డి అవధానమును, తమిళ అల్లరిమూక జరగనీకుందా చేసేనింది. ప్రభుత్వ కార్యాలయాల మీద తెలుగు పేర్లు తొలగిపోయి అరవరాతలు (పత్యక్షమయినాయి. అంగళ్లమీద కూడా తమిళమే ఉండాలని వ్యాపారస్తులమీద ఒత్తిడి పెరిగింది. పంచాయితీ తీర్మానాలన్నీ తమిళంలోనే ఉండి తీరాలని పట్టుపదతా ఉందారు.

1969 డిసెంబరు నాలుగో తేదీన స్కూలుకుపోతా ఉందే తెలుగు ఆదబిడ్దలమీద, కాళ్లతో బురదనీళ్లను చిమ్మి గలాట చేసిరి తమిళ రౌడీ చిన్నోళ్సు. దానిని చూసిన ఒక తెలుగు మాస్టరు ఆచిన్నోళ్లను మందలించినాడు. ఆ రాత్రికిరాత్రే “హోసూరులో తెలుగు చచ్చింది, తెలుగు మేస్టరూ చస్తాడూ అనీ గోడల మీద రాతలు వెలనీనాయి.

దీనికి నిరసనగా, డిసెంబరు తొమ్మిదో తేది పొద్దున్నే తెలుగు విద్యార్థులంతా ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో సమావేశమయ్యిరి. ఇదంతా ఒక పథకం ప్రకారం జరగతా ఉందనీ వాళ్లకు తెలియదు. అంతకు ముందునాదే రిజర్వుపోలీసు దళాలు హోసూరులో దిగిందాయి. ఉన్నెట్లుంది ఆ దళాలన్నీ కళాశాలను చుట్టుముట్టినాయి. ఆ కళాశాలకు చుట్టూ ఇనుపముళ్ల తీగ, లోపలకూ బయటకూ ఒకటే ద్వారం. ఆ దారినీ కమ్ముకున్న పోలీసులు విద్యార్థుల మీద పడిరి. లోపల ఉందేది తీవవాదులో ఉగ్రవాదులో కాదు. పైకి తెగబడి వస్తుండే రౌడీల నుండి అమ్మను కాపాడుకొనేది ఎట్లనో ఆలోచించే దానికి కూర్చునుందే విద్యార్థులు. లాఠీలతో కేనులతో కొట్టేదీ

| తెలుగుజాతి పత్రిక ఇవ్మునుడి ఈ జులై-2020 |

బూటుకాళ్లతో తన్నేదీ ఆరంభమయింది. ఎందరో సౌరణతప్పి పడిపోయిరి. 25 మంది దారుణంగా గాయపడిరి. కల్ల(కంచె)ను ఎగిరిదూకి పారిపోవాలనీ ప్రయత్నించిన వాళ్లకు, ఒళ్లంతా ఇనుప ముళ్లు చీరుకొనీపోయినాయి. కొందరికి గొంతులో గుచ్చుకొని శాశ్వతంగా మూగవాళ్లయిపోయిరి.

దారుణమైన ఈ హింసాకాండ ఒకపక్క జరగతా ఉంది. మరొకపక్క తెలుగువాళ్లను కొట్టిన దానీకి కారణం చూపించేకని, కొందరు నీచమైన యోచనచేసిరి. అన్నాదార మట్టిశిలను కొట్టి వికారం చేసి తెలుగు విద్యార్థులు, నెత్తురోదే బట్టలతో హోసూరు వీధుల్లో 'జై తెలుగు” అని నినదిస్తా ఊరేగింపుగా నదిచిరి.

జిల్లా కలెక్టరు వచ్చి, మన్నింపవు అడిగి, నష్టపరిహారం కట్టమన్నాడు. తెలుగు విద్యార్దులు ఒప్పుకోలేదు. చేయనీ తప్పుకు తలవంచమని తెగేనీ చెప్పేనిరి. రాత్రికి రాత్రే 144 సెక్షన్ను అమలులోకి తెచ్చిరి. ఎక్కడివాళ్లనక్కడ నీర్చంధించేదీ అరెస్టుచేసేది ఆరంభమయింది. రంగారెడ్డి, కిష్టమూర్తి, రాజన్ను మునిసీతప్ప, ప్రభాకరరెడ్డి, గురప్ప చౌదరి, సిద్దప్ప, గోపాల్క్‌ ఖీమప్ప, కిష్టప్ప, నాగప్ప, లక్ష్మణరెడ్డి, చిక్కన్న, క్రిష్టాచారి, సంపంగి, పొన్నప్పు, శంతరాచార్సి, పాంటు, గోపాలక్రిష్ణ, మోహన్‌, పట్టన్న ఆంజప్ప, శివన్న సంపత్‌ వంటి 36మంది తెలుగు మేస్టర్లను హోసూరు చెరసాలలో వేసి, అనెంక సేలం చెరకు తరలించిరి. మునిస్వామి, రామచంద్ర, జయరామరెడ్డి, రామచంద్రప్ప, రామన్న శీనివాసరెడ్డి, రామస్వామి, నారాయణమూర్తి, ఆదినారాయణరెడ్డి, రామానుజప్ప, మునియప్ప, గోపీనాథ్‌, వెంకటేశ్‌, క్రిష్ణమూర్తి వంటి ముక్కుపచ్చ లారని 15 మంది 15 ఏండ్ల లోపు చిన్నోళ్లని సేలంకు తరలించి చెరలో పెట్టిరి. 'తెలుగువాళ్లను చెరలో పెట్టేస్తిమి, తెలుగు ఆడోళ్లను చెరపట్టచ్చు” అని పోలికేకలు పెట్టిరి.

మరునాడు పొద్దున్నే హోసూరులో సంత. 144 సెక్షన్‌ అంటేనే తెలియని పల్లెల జనం హోసూరుకు చేరుకొనిరి. సంతకు పోతుందే వాళ్లని లాఠీలతో బాదసాగినారు పోలీసులు. ఏం జరగతా ఉందనేది అమాయక పల్లెజనంకు తెలియలేదు. దుమ్ములో కూరుకుపోయేనట్లు కొట్టి, తన ఏకైక ఆస్తి అయిన 120రూపాయలను పోలీసులు కాజేస్తుంటే “ఇంక తెలుగులో మాట్లాడితే చంపేస్తారంట, నిజమేనా అప్పా” అంటా గొల్లుమనింది ఒక తెలుగు ముసలామె. శివారు ప్రాంతమైన కుముదేపల్లి వంటి [గ్రామాలపై దాడిచేని, గొరైల్ని మేపుకొంటా ఉందే తెలుగు ఆడవాళ్లను పట్టుకాని పదిమ్టైళ్ళకు అవతలున్న సూలగిరి పోలీస్‌ స్టేషనుకు ఈడ్బుకొనిపోయి దారుణంగా చెరిచిరి. సంగం క్షవరం చేయించుకొన్న మగవాళ్లను మంగలి అంగళ్లనింకా బయటకు ఈడ్చి కొట్టిరి. హోటళ్లలో దూరి సగం బోజనం తినీనవాళ్లనీ ఈడ్చుకొని వచ్చి బాదిరి.

కోమటివారి అంగళ్లలోని సరుకులనంతా లూటీచేసి, మిగిలిన వాటిని వీధుల్లోకి చిమ్మేసిరి. పన్నెండు వేల జనాభాగల హోసూరు పేట వల్లకాదుగా మారిపోయింది.

ఇంక చెరసాలల్లో పెట్టినవాళ్ల వెతలు అన్నీయిన్నీ కాదు. వాళ్ల బట్టలూ డబ్బులూ చెప్పులూ అన్నిటినీ కాజేసిరి. వారి బట్టలలోనే వారిచేతనే ఉచ్చలు పోయించిరి. మరుగుదొడ్డలో దొర్లిస్తూ బూటుకాళ్లతో తన్నిరి. అన్నిటికంటే ఘోరం, వాళ్ల మర్మాంగాలను