ఈ పుటను అచ్చుదిద్దలేదు

త్‌

ఛారావాలాక

నాం

“జల ప్రల న! తీ, లీ

ఎస్‌ ఎస్‌ ఎల్‌ సి తో నా చదువు ముగిసిపోయింది. ఈ కతలు అక్కడితో నిలిపేసి ఉందాలి. కానీ ఈ కదసీ (ఛివరి) కతను చెప్పే తీరాల అనిపించి చెప్తా ఉందాను. మా అబ్బ తీరిపోయినంక ఇంటికి పెద్దకొడుకుగా నా భుజాలమీవచ మోయలేనంత బరువు వచ్చివడింది. ఏడెనిమిది నెలలు ఊర్లోసేద్యం పనులు చేస్తా రాటుదేలితిని. మా చిన్నబ్బల్లో ఒకాయునకు ఆవులంటే పంచప్రపాణాలు. మా వూరినింకా ఇరవైఐదుమైళ్ల దూరములో ఒక పెద్ద అడవి ఉంటుంది. ఆ అడవిలో ఇరులోళ్లు అనే ఒక గిరిజన తెగకు చెందినవాళ్ల పల్లెలుంటాయి. వాటిలో ఒకటి రాగిపల్లి. పంటలకాలంలో మా ఆవులబ్బ (మాచిన్నబ్బను ఇట్లే పిలుస్తాము), ఆవుల్ని అక్కదే మేపుకొని తిరిగి వస్తుంటాడు. అట్ల ఫోతావస్తా ఉందేతపుడు ఆ రాగిపల్లి తావున కొంచెం చేను కొన్నాడు. ఆయనకు సేద్దెం పనులలో తోడుగా ఉందేకి 1960లో అడవిసీమకు పోయి, ఏదేండ్లు అక్కడనే ఉండిపోతిని. (ఇరులదొడ్ది బతుకులు అనే పేరుతో ఆ కతల్ని మన నడుస్తున్న చరిత్ర పత్రిక అచ్చువేసింది. )

ఆ ఏదేంద్లు హోసూరు తావున ఏమి జరగతా ఉందాయనేది నాకు తెలిసేదే లేదు. 1867లో నేను తిరిగి మా హోసూరు తావుకు వచ్చేసరికి శాసనసభ ఎన్నికల ప్రకటన వెలువడి ఉంది. తెలుగు ఉపాధ్యాయులైన ఇద్దరు గురుశిష్యులు మా తావునున్న రెండు నియోజక వర్ణాలలో స్వతంత్ర పక్షం తరపున నిలబడి ఉందారు. ఉద్దనపల్లి నియోజకవర్గం నుంది శీకె.ఎప్‌, కోదండరామయ్యగారు, హోసూరు నియోజకవర్గం నుండి వారి శిష్యుడైన బి. వెంకట స్వామిగారు.

“ఎట్లయినా మన హోసూరు తావును ఆంధ్రాలో కలపాలని కంకణం కట్టుకొన్నారంట కోదండరామయ్య మేస్టరు. మన ఓట్లన్నీ ఆయనకే వేయాల” మావూరి రచ్చబండ తావ ఎగుర్లాడతా చెప్పినాడు ఒక కోడదెయీడు చిన్నోడు.

“అబ్బయ్యా రవంత నీదానీంచు, ఆ మహన్నబావుడు నిలబడి ఉండేది మన నియోజకవర్గంలో కాదు, ఉద్దనపల్లిలో. మనము ఆయన శిష్యుడైన వెంకటస్వామి మేస్టరును ఇక్కడ గెలిపించాల” ఒక పెద్దాయన, చిన్నోని దూకుడును అణచినాడు.

“ఈ అరవ అధికార్ల పెత్తనం జాస్తి అయితా ఉంది. నూరారు తెలుగు స్మూళ్లు వెయ్యారు తెలుగు ఊర్లూ లక్షాంతరం తెలుగు జనాలూ ఉంది కూదా ఆ పదిరవై మంది అరవ అధికార్లకు తల వంచాల్సి పడతా ఉంది. కాంగైసు ఏలుబడిలోనే ఇట్లుందే, అదేమో డిఎముక (డి.ఎం.కె.) పార్టీ అంట, దిగువసీమంతా ఆ పేరునే కలవరిస్తా ఉందాదంట, అదేమన్నా అధికారంలోకి వచ్చేస్తే మనపనీ ముగిసిపోతుంది. ఎట్లన్నా గాసిపడి ఆంధ్రాలో చేరుకొనేయాల. దానీ కోనరమన్నా కోదండరామయ్యానీ వెంకటస్వామినీ గెలిపించాల” ఇంకొక పెద్దాయన గొంతెత్తి చెప్పినాడు.

మా నియోజక వర్గాల్లో తెలుగోళ్లము ఒక్కట్టు (కమత్యం) | తెలుగుజాతి పత్రిక జత్సునుడి ఆ ఖజులై-2020

నంద్యాల నారాయణరెడ్డి 9360514800


చూపిస్తిమి. కోదండరామయ్య గార్హూ ఆయన శిష్యడు వెంకటస్వామి గారు శాసనసభ్యులుగా గెలిచిరి. ఆనందంతో పొంగిపొర్లితిమి మేమంతా. అయితే మా ఆనందం చానాకాలం నీలవలేదు.

1967లో వుద్రాను రాష్టంలో డి.ఎం.కె. అధికారం మొపలయింది. ఎంగుం తమిళం ఎదిలుం తమిళం (అంతా తమిళం అన్నీటా తమిళం) అనే పెనుగొంతు మదరాసు రాష్ట్రమంతా మారుమోగింది. తెలుగు కన్నడ మలయాళ ఉరుదూ నుడులవారి గుండెల్లో ఏదో తెలియని అలజడినీ రేపింది.

1967 ఆగస్టు నెల - మావూరినీంకా మ్రైలుదూరంలోని నల్లూరులో ఉందే స్కూలుకు పోయుండిన చిన్నోళ్లు మాపుసరి ఇంటికి వచ్చి ఆ వార్తను చెప్పిరి. అందరమూ రచ్చ దగ్గర కూడితిమి.

“ఎట్టప్పా ఇది, స్కూల్లో తెలుగులో ప్రార్దన చేయరాదంట, ఇంకమీదట తమిళ్ళోనే (ప్రార్ధన చేయాల్నంట. ఏమప్పా చేసేది?” ఒక గొంతులో ఆందోళన.

“తెలుగు స్కూల్లో అరవం పాట పాదల్నా మనం పాదేదొద్దు. ఎవురొస్తారో రానీ చూస్తాము” ఒక గొంతులో ఆవేశం.

“నిన్న మొన్న హోసూరు న్మూల్లో ఇట్లే తిరగబడిరంట. పోలీసోళ్లు వచ్చి మేస్టర్లనంతా బెదిరించేసి పోయిరంట. ఊరికే ఎగుర్లాడి ప్రయోజనం లేదు. అవతలితట్టు ఉందేది ప్రభుత్వము. పెద్దోళ్లను కలిసి మాట్లాడాల. మన ఎమ్మెల్లేలను చూసి మాట్లాడాల” ఒక గొంతులో అనుభవం.

ఆ మరునాడే చదువుకొన్నవాళ్లం నలుగురయిదుగురం కలిసి ఎమ్మెల్లే గారిని చూసేదానీకి హోసూరుకు పోతిమి. మా అట్లానే చానా ఊర్ల జనం వచ్చిందారు. మా ఎమ్మెల్లేలు ఇద్దరూ కలసి ప్రభుత్వానికి విన్నపం తయారించిరి. దానిని అందరికీ చదివి వినిపించిరి.

అనెంక ఒక మేస్టరు లేచి నిలబడి ఇట్ల మాట్లాడిరి.

“ఇక్కడ చదువుకొన్న చిన్నోళ్లు చానామంది ఉందారు. దయచేసి మన తావు చరిత్రను రవంత తెలుసుకోవాలని కోరుకుంటా ఉందాను. 1167 చదరపు మైళ్ల వైశాల్యముందే మన హోసూరు తావున సుమారు మూడున్నర లక్షలమంది తెలుగువాళ్లం ఉందాము. రెండువేల ఏండ్లకు ముందు మనతావు తెలుగుదారఠరలైన సాతవాహ నుల ఏలుబడి కింద ఉండేది. అనెంక కూడా ఎందరో తెలుగు కన్నడ రాజులు మన నేలను ఏలిరి. విజయనగర రాజుల కాలంలో తెలుగే ఇక్కడి పరిపాలన భాషుక్రీ.శ. 1776 లో జరిగిన శ్రీరంగపట్న యుద్ధం తరువాత, కోలారు బెంగళూరు జిల్లాలు మైసూరు రాజ్యంలో కలిసిపోగా, వాటికి ఆనుకొనుందే హోసూరు ప్రాంతం తెల్లవాళ్ల చేతికి వచ్చి సేలం జిల్లాలో భాగమయింది. 1853 లో ఏర్పడిన ఆంధ్ర