ఈ పుటను అచ్చుదిద్దలేదు

మానవుల్ని అమానవీయంగా చంపేసిన హీరోషిమూ, నాగసాకీ సంఘటనలు ఆయనకు మానవ స్వభావం పైన విరుద్ధమైన నమ్మకాల్ని కలిగించాయి. “లార్డ్‌ ఆఫ్‌ ది ప్లయిస్‌” అనేది సాటన్‌కు ప్రథమ సేనాని అయిన వీయల్డ్‌ బబ్‌కు మళఠో పేరు: వొక యుద్ధ సమయంలో ఆ ద్వీపానికి చేరుకున్న అదే పిల్లలు ముందుగా ప్రజాస్వామికంగానే ప్రారంఖిస్తారు. యెన్నికలు నిర్వహించి నాయకుడ్ని యెన్నుకుంటారు. కానీ వేటపైన అటవి కన్యాయాల సైనా యిష్టముండే నురో కుర్రాడు తిరగబడి వేరే రాజ్యం నిర్మించుకుంటాడు. ఆ ద్వీపపు మూలస్వభావాన్ని కనిపెట్టిన కుర్రాడ్ని యొప్పుడూ సహేతుకమైన మానవత్నాన్ని ప్రతిపాదించే మరో కుర్రాద్ని తోటి పిల్లలే చంపేస్తారు. వొకరిని వొకరు తరుముకుంటూ ద్వీపానికంతా అగ్గి పెట్టేస్తారు. ఆ అగ్గి మంటల్ని చూసిన నౌకా సైన్యాధిపతి వొకరొచ్చి వాళ్లందర్నీ మళ్లీ ఇంగ్లాండు తీసుకెళ్తాడు. అప్పటి ప్రజాస్వామ్యుమూ, యేకస్వామ్యూలమధ్య ఉండే పోటీ నుంచీ మొదలుపెట్టి మానవ స్వభావాన్ని నిర్వహించే అనేకానేక తత్వవేత్తల అభ్మీప్రాయాలనంతా చర్చకు పెట్టేవిధంగా రాసిన “లార్డ్‌ ఆఫ్‌ దె వ్లయిస్‌” నవల డానికి మూలమైన “కోరల్‌ ఐలండ్‌” కంటే చాలా గొప్పగా, బహుళ పార్య్యాలను చిత్రించే విశిష్టమైన రచనగా రూపొందింది.

“కోరల్‌ ఐలాండ్‌” అనే నవల విరిగి, చిట్లి, క్రుంగి, కృశించి యొరువైపోతే అ మెరుపులోంచీ నా నవల ట్రేళ్లు వ్యాపించుకుంది. అంటాడు గోల్డింగ్‌. ఆయనే “వొక రచనలోంచి మరో రచనను బలవంతంగా పుట్టించదలుచుకున్నప్పుడు కేవలం మృత శిశువే పుడుతుంది అంటాడు. ఈ రెండు రకాల విశ్లేషణల మధ్యే నిజముంటుంది. కేవలం ఒక రచనను నిరనించి, వ్యతిరేకించినంతమాత్రాన మరో గొప్పరచన పుట్టదు. మరో రచన భూమికలోంచీ పుట్టినప్పటికీ యేరచనయితే తనదైన స్వయం(్రతిపత్తిని సాధించుకుంటుందో అది మాత్రమే సాహిత్యంలో మనగలుగుతుంది. సాహితీ యాత్రలో రచనలూ, (ప్రతిరచనలూ యెప్పుడూ వస్తూనే వుంటాయి. తెలుగు సాహిత్యంలోనూ యీధోరణి తొలినుంచి యిప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. అయితే గోల్డింగ్‌ చెప్పిన ఆ సత్యాన్ని గుర్తించి, పాటించిన రచనలే చివరకు గొప్ప రచనలుగా మగులుతాయి.

స్పందనను వ్రాయంది “అమ్మనుడిలో రచనలపై మీ స్పందనను పంపండి సంపాదకుడు: అమ్మనుడి,

జ2, హిందీకళాశాల వీధి,

మాచవరం, విజయవాడ -4 ఇ-మెయిల్‌: 66/0/2/౧712౧౮6/ ఆర్రగ౭/. 20/౧ | తెలుగుజాతి పత్రిక జవ్మనుకి ఈ జరై-2020 |


కరోనా నానీలు

తల్లి ఒడిలో పాప ఏడుపు వలస మేఘం

కన్నీటి వరదై...

కర్య్యూ దృశ్యం

నేస్తాల సవాళ్లు

భర్తల సేవలు

అయితే గరిటె కాకుంటే... ఛీపురుతో

కసాయి మనుషులతో కూదా...!

పరిశుభత

భౌతిక దూరం

మాస్కు ధారణ

కరోనా నేర్చిన “తిపాఠాలు” !

ప్రపంచం కుగ్రామం ఏకాంత వాసం ఒకప్పటి మాట “ఇల్లే ప్రపంచం”

ఈనాటి బాట మనో కమల వికాసం

విదేశీ మోజు తీరిందా ! సరదా ?! స్వదేశాఖిమానమే మానవాళికి రక్ష

కరచాలనం వద్దు నమస్కారం ముద్దు దూరం మన హద్దు సంస్కారమే శాస్తి ! డాక్టర్‌ కలువకుంట రామకృష్ణ,

లె 'సెల్‌ : 9440152405

స్వల్ప నిర్లక్ష్యం చాలు మృత్యువు సంతకానికి ముందు చూపే రోగానికి మందు.

బతుకుదాం

అందర్నీ బతుకనిద్దాం అప్పడే కదా - బతుకుకు సార్థకత ||


“థీమ్‌ ఆశించిన బౌదం ౨26 వ పుట తరువాయి ... జ

ఆయన ధర్మం” “ప్రాచీన భారతంలో విప్లవం, ప్రతివిప్లవం” అనే అంబేద్మర్‌ గ్రంథాలను అధ్యయనం చేస్తే వాటిలో ఆయన బౌద్దం సాధించిన సామాజిక విప్లవమే ప్రధానంగా ్రస్తావిస్తాడు గానీ,

దాని దార్శనిక తోడ్పాటును అసలు గుర్తించనేలేదు. (ప్రతీత్య సముత్సాదం, నాగార్జునుని శూన్యవాదం వంటి జౌద్ద తత్వవేత్తల దార్భనీక కృషిని, వైజ్ఞానిక కృషిని అధ్యయనం చేయడంపై దృష్టి పెట్టివుంటే అంబేద్మర్‌ ఈ దేశానికి మరొక గొప్ప ఆధ్యాత్మిక అస్త్రాన్ని అందించగలిగి ఉండేవాడు. అంబేద్మర్‌ వాదులు, బౌద్టీయులు రెండు విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఒకటి - బౌద్దం విషయంలో అంబేద్మర్‌ లేవనెత్తిన ప్రశ్నలన్నిటికీ సహేతుక సమాధానాల కోసం గంభీరమైన సార్వజనీన చర్చను నిర్వహించాలి. రెండు- శకల మతవాదమైన కుల అస్తిత్వవాద దృక్పథాలకు పరి మితం కాకుండా బౌద్దం స్వీకరించేందుకు దోహదం చేసిన మలి అంబేద్కర్‌ దృక్పథాన్ని ఆకళింపు చేసుకునేందుకు కృషి చేయాలి. “బహుజన హితాయ, బహుజన సుఖాయ'అనే వైఖరిని చేపట్టాలి,