ఈ పుటను అచ్చుదిద్దలేదు

“పామెలాను చదివిన హెవ్రీఫీల్దింగ్‌ అనే నాటకరచయిత రిచర్డ్‌సన్‌ ప్రతిపాదించే సచ్చీలతను నిరసించాడు. పామెలా నిజానికి పెద్ద యొత్తుగడే వేసిందనీ, అలా తప్పించుకునే సచ్చీలత నిజాయితీతో వుందదనీ ఆయన నమ్మకం అందుకనే ఆయన 'పామెలాకు పారడిగా జోసెఫ్‌ ఆండ్రూస్‌ అనే నవల రాశాడు యిందులో పామోలాకు జోసెఫ్‌ ఆంధ్య్యాస్‌ అనే తమ్ముడుంటాడు. వాడు మిసెస్‌ వీవీ అనే ధనవంతురాలి యింటిలో సేవకుడు. మొగుడు చనిపోతూనే వీవీకన్ను జోసెఫ్‌ఫైన పడుతుంది. కానీ 'ఫానీ అనే అన్మూయిని ప్రేమించిన జోసెఫ్‌ ఆమెకు లోబడడు. ఆమె అతడ్ని ఉద్యోగంలోంచీ పీకేసి తరిమిపారేస్తుంది. ఇల్లు వదలిన జోసెఫ్‌కు 'పార్సన్‌ ఆడమ్స్‌” అనే మత గురువు తగులుతాడు. అతగాడు అచ్చంగా దాన్‌ క్విగ్గోట్‌కు మరోరూపం. అప్పటినుంచీ పార్సన్‌ ఆడమ్స్‌, జోసఫ్‌ ఆండ్యూస్‌లు అనేక సాహసాలు చేస్తారు. అవన్నీ హాస్యస్ఫూరకంగా వుంటూనే సమకాలీన సమాజాన్ని వ్యంగ్యంగా దుయ్యబడతాయి. రిచర్డ్‌సన్‌ 'పామెలా ఫీల్దింగ్‌ జోసఫ్‌ ఆండ్యూస్‌ యింగ్లీషులోని తొలి నవలుగా గుర్తించబడుతూ వున్నాయి.

పరస్పర భావవైరుధ్యాలవల్ల రచించబడే రచనలను 'పారడీ అనటంకంటే ప్రతిరచన అనటం గూడా సముచితంగానే వుంది. జేమ్స్‌జాయిస్‌కు నోబుల్‌ బహుమానాన్ని తీసుకొచ్చిన “యూలి సెస్‌” నవల హోమర్‌ అనే గొప్ప (గ్రీకు కవి రాసిన “ఒదెస్సీ' అనే పురాణగాధకు పారెడీగానే వచ్చింది. ఒడెస్సీలోని కథానాయకుడు యాంసెస్‌ లాగా నవలలోని కథానాయకుడు వీరుదేమీకాదు. సాదాసీదా మధ్యతరగతి మనిషి మాంసం అంగడిలోకెళ్ళి కాస్త మూ్య(తవిండాల్ని కొనడవబా, రాత్రుల్లో వేశ్యాగ్భవోల్ని సందర్శించడమూ వంటివే అతని సాహసాలు. అయితే పారిడీగా ప్రారంభమైన రచనను యెంత బాగా స్వతంత్ర ప్రతిపత్తి గూడావుండే రచనగామార్చాలో తెలునుకోవడానికి “యూలెస్‌స్‌” బాగా దోహదపడుతుంది.

తెలుగులో విశ్లేషణకు యెన్నుకున్న రచనలకున్న (పొముఖ్యతను తులాత్మకంగా తొలునంకోడానికి పాశ్చాత్యసాహిత్యంలోని యీ ఖామికను తెలుసుకోవడం చాలా అవసరం. తెలుగు సాహిత్యంలోనూ యిటువంటి రచన-(ప్రతిరచన చాలానే ఉన్నాయి. సదస్సుకున్న పరిమితులదృష్ట్యా కొన్నిమాత్రమే తీసుకున్నారు. మొదటిది విశ్వనాధసత్యనారాయణగారి నాటకం “వేనరాజూ త్రిపురనేని రామస్వామి చౌదరి గారి “ఖూనీ” వేనరాజులో వైదికథర్మాన్ని అణచివేసి, మొత్తం సమాజాన్నే యిబ్బందిపెట్టే సేనుడు, ఖూనీలో నాన్తికుడుగానూ ప్రజల్లోవుండే మూఢవిశ్వాసాల్నీ యజ్ఞయాగాల్నీ వ్యతిరేకించే వాడుగా చిత్రించబడ్డ్దాడు. ఖూనీలో వేనరాజు తండ్రి అంగరాజు చంపబడతాడు. రెండు ఖీన్నమైన ఖావధారలకు చెందిన ఇద్దరు నాటకల రచయితల రచనలవి తివృరనేని రామస్వామిచౌదరి గారి ఖూనీ “వేనరాజూకు ప్రతిరచనగానే రూపొందింది.

రెందవఅంశం “విశ్వనాధ సత్యనారాయణ చెలియకట్టచలం

| తెలుగుజాతి పత్రిక జవ్మునుడె ఉ జువై-2020

-మైదానం” ప్త స్వాతంత్ర్యాన్ని స్వేచ్చనూ చిత్రించిన మైదానంలాగే, హద్దుల్లేని, అవధుల్లేని స్వేచ్భాస్వాతంత్రాలను నిరసించిన 'చెలియలికట్టి గూడా బాగా ప్రసిద్ధమైన రచన. 'ఎండ్లూరి సుధాకర్‌ వర్గీకరణము-గూటంస్వామి ఏకీకరణమూలను పరిశీలించడం మూడవఅంశం. యిప్పుడు దళితులకున్న రిజర్వేషను సమస్యను ఇద్దరు కవులు ఖీన్నరీతుల్లో పరిష్కరించడం, దానికి రకరకాల స్పందనలు రావడం అందరికీ తెలుసు. కేతు విశ్వనాధరెడ్డిగారి కథ “అమ్మవారినవ్వు” దానికి వెంటనే ముహమ్మద్‌ ఖదీర్‌ బాబు వ్రతిరచనగా రాసిన “మక్కాచంద్రుడూలను చర్చించడం చివరిఅంశం. 'మక్కాచంద్రుడు” రచన దొరకడం, పత్రాన్ని సమర్చించిన ఆచార్య రాజేశ్వరిగారికే కష్టమైపోయిందన్నారు. చివరకు రచయితను సంప్రదించినా ఆమె కథను సంపాదించుకోలేకపోయారు. యిన్ని పరిమితులున్నా వీలయినంతలో ఆసదస్సులో “రచన- ప్రతిరచన” అనే ఈ కొత్త అంశాన్ని సంక్షిప్తంగానైనా చర్చించగలిగారు.

యే రచనలోని భావజాలన్టైనా నచ్చకపోయినప్వుడు వ్యంగ్యంగానూ, అవహేళన చేసేరీతిలోనూ ప్రతిరచన చేయడం సహజమే. అయితే ఆ (వ్రతిరచనకున్న స్వయంటవ్రతిపత్తిని సాధించలేకపోవడం లోపమే అవుతుంది. యీ విషయాన్ని సావథానంగా అర్ధంచేసుకోవడానికి వొక గొప్ప యింగ్లీషు నవలే వుదాహరణగా దొరుకుతోంది. 1983లో నోబుల్‌ బహుమానం పొందిన విలయం గోల్డింగ్‌ “లార్డ్‌ఆఫ్‌ ది ఫ్లయిస్‌” (010 01 1౧6 ౧||౪౨) 18వ శతాబ్బానికి చెందిన విలియం బాలెంటైన్‌ అనే రచయిత రాసిన “కోరల్‌ ఐలాండ్‌” అనే నవలకు పారడీగా రాసినదే. రెండవ ప్రపంచయుడ్దానికి ముందు ఇంగ్లాండులో ఉపాధ్యాయుడిగా పనిచేసిన గోల్ట్డింగ్‌ కోరల్‌ ఐలండ్‌ను పిల్లలకు పాఠంగా చెప్పాడు. అనవలలో రాల్ఫ్‌, జాక్‌, పీటర్‌ కిన్‌ అనే ముగ్గురు పిల్లలు “జ్రద్రోు అనే నౌకలో ప్రయాణం చేస్తారు. తుఫానులో తగులుకున్న ఆ నౌక పగిలిపోయి, పిల్లలు ముగ్గురూ కోరల్‌ ఉలాండ్‌ చేరుకుంటారు. అక్కడ మరో నరపురుగు కూడాలేదు. ఆ ద్వీపంలో వాళ్ళు దాదాపు మూడు సంవత్సరాలుండిపోతారు. కావాల్సిన గూడూ, పడకా తయారుచేసుకుంటారు. తియ్యని పండ్లు తింటూ, శుభ్రమైన నీళ్ళు తాగుతూ అదొక పండుగలాగా కాలం గడపతారు. యొుదురైన క్టూరమృగాల్ని ఆటవికుల్నీ ఓడించి ఆ ద్వీపానికి రాజులైపోతారు. చివరకు తామే స్వయంగా నౌక నొకదాన్ని తయారు చేసుకొని మాతృభూమికి చేరుకుంటారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో స్వయంగా పాల్గొన్న గోల్ట్‌రింగ్‌కు బాలెంటైన్‌ నవల్లోని పిల్లల ప్రవర్తన అసహజంగా కనిపించింది. సమాజం నుంచి దూరం తీసుకెళ్తే గొప్ప సహజీవనం చేసి విజయ వంతులుగా తిరిగొచ్చే పిల్లలు వాస్తవాతీతంగా కనిపించారు. అందుకని అదే కోరల్‌ఐలాండ్‌ భూమిక అనే పాత్రల్ని తీసుకొని ఆయన ఆ కథనం ఇప్పటి వాస్తవికతకు అనుగుణంగా తిరిగి రాశాడు. ఆయన తేనెటీగలు ఎంత సహజంగా తేనెను తయారు చేస్తాయో అంతే సహజంగా మనుషులు చెడును తయారు చేస్తారని నమ్మాడు. తోటి